twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాన్స్ చేస్తూ గాయపడ్డ మహేష్ హీరోయిన్

    By Bojja Kumar
    |

    ముంబై: మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన భామ క్రితి సానన్. ఇటీవల విడుదలై ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. సినిమా కాన్సెప్టు ప్రేక్షకులకు అంతగా ఎక్కక పోవడమే ఇందుకు కారణం. అయితే సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, క్రితి సానన్ పెర్ఫార్మెన్స్, గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి.

    మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చిన వెంటనే క్రితి సానన్‌ను మరో బాలీవుడ్ ఛాన్స్ కూడా వరించింది. 'హీరోపంటి' అనే హిందీ సినిమాలో ఆమె నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది. మంచుతో కూడిన ప్రాంతంలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. 10 ఫీట్ల హైట్ ఉండే ఊయల లాంటి దానిపై హీరో హీరోయిన్లపై సీన్ తీస్తుండగా ఇద్దరు జారి మంచులో పడిపోయారు. దీంతో హీరోయిన్ క్రితి సానన్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి.

    అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో షూటింగు మరో రోజుకు వాయిదా వేసారు. క్రితి సానన్ పరిస్థితి బాగానే ఉందని, ఆందోలన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. హీరోపంటి చిత్రం మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాజిద్ వాజిద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    
 Kriti Sanon injured in shooting. Kriti Sanon who starts her career with Nenokkadine is now acting in Bollywood movie ‘’Heropanti’’ and the shooting was happening at Kashmir where the incident was happened.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X