సెట్స్‌లో సెక్సీగా... మహేష్ హీరోయిన్ క్రితి సానన్(ఫోటో)
హైదరాబాద్: మహేష్ బాబు-సుకుమార్ సినిమా ద్వారా క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి పరిచయం హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో కలిసి షూటింగులోపాల్గొంటోంది. ఆమె సెట్స్ సెక్సీ డ్రెస్సులతో మెరిసిపోతేంటే యూనిట్ సభ్యుల మతి పోతోంది.
క్రితి సానన్ గతంలో పలు యాడ్ ఫిల్మ్స్ లో నటించింది, ఆమె నటించిన పలు యాడ్ ఫిల్మ్‌లో క్రితి సానన్ హావభావాలు భాగానే ఉన్నాయని, సుకుమార్ లాంటి దర్శకుడు కావడంతో ఆమె నటన విషయంలో మరింత పరణితి చెందే అవకాశం ఉందని అంటున్నారు. మరి క్రితి సానన్ అదృష్టం ఎలా ఉందో సినిమా విడుదలైతే గానీ తెలియదు.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications












