సుశాంత్ సింగ్ మరణంపై పెదవి విప్పిన కృతి సనన్.. మానసిక పరిస్థితి అంటూ...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా స్పందించింది. గత కొద్దికాలంగా సుశాంత్ సూసైడ్ పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న ఆమె తాజాగా తన భావాలను పంచుకొన్నారు.
సుశాంత్ మరణం తర్వాత జరిగిన వాదనలు, చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఆ గందరగోళంలో నేను భాగం కాదలచుకోలేదు. నన్ను చాలా విషాదంలో ముంచెత్తింది అని కృతి సనన్ పేర్కొన్నారు.

2020 సంవత్సరం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నా జీవితంలో ఆ సంవత్సరం విషాదాన్ని నింపింది. సుశాంత్ మరణం తర్వాత నా మానసిక పరిస్థితి బాగాలేదు అని కృతి అన్నారు.
సుశాంత్ మరణం తర్వాత కొందరు సానుకూలంగా, మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. ఆ నెగిటివ్‌లో నేను భాగం కావొద్దని అనుకొన్నాను అని కృతి సనన్ అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి కృతి సనన్ రాబ్తా చిత్రంలో నటించింది. రాబ్దా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకొన్నది.


Click it and Unblock the Notifications











