నాగ చైతన్యతో మహేష్ బాబు హీరోయిన్?
హైదరాబాద్: 'స్వామి రారా' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుధీర్ వర్మ త్వరలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రం మహేష్ బాబు సరసన '1 నేనొక్కడినే' చిత్రంలో నటించిన క్రితి సానన్ హీరోయిన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. జూన్ చివరి వారంలో ఈచిత్రం ప్రారంభం కానుంది.
దీంతో పాటు క్రితి సానన్ మెగా హీరోల సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో క్రితి సానన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలోనూ క్రితి సానన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఏకంగా ఇద్దరు మెగా హీరోలు, మరో వైపు నాగ చైతన్య సరసన అవకాశం రావడంతో ఈ సారి తనను విజయం తప్పకుండా వరిస్తుందనే ఆశ పడుతోంది క్రతి సానన్. ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్క సినిమా హిట్టయినా తన దశ తిరుగుతుందని భావిస్తోంది. మరి ఈ సారైనా ఈ భామకు విజయం దక్కాలని కోరుకుందాం.
ప్రస్తుతం క్రితి సానన్ హిందీలో 'Heropanti' అనే చిత్రంలో నటిస్తోంది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











