మహేష్-సుకుమార్ మూవీలో కొత్త హీరోయిన్(అఫీషియల్)
హైదరాబాద్: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన హీరోయిన్ మ్యాటర్‌పై ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే అమ్మాయి ఎంపికైంది. ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆమెకు ఇదే తొలి సినిమా అవకాశం. కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో నటించినట్లు సమాచారం.
తొలుత తమన్నాను హీరోయిన్‌గా అనుకోగా డేట్స్ కుదరక పోవడం వల్ల కాజల్‌ని ఎంపిక చేసారు. ఆ తర్వాత కాజల్‌ను ఫైనల్ చేసినా అమె కూడా హ్యాండ్ ఇచ్చింది. మొన్న బాలీవుడ్ బేబీ దీపిక పడుకొనె పేరు వినిపించింది. ఎట్టకేలకు ఈ కొత్త భామ మహేష్ బాబు సరసన అవకాశం దక్కించుకుంది.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్ర తరువాత షెడ్యూల్ అక్టోబర్ 10 నుండి గోవాలో మొదలు కానుంది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











