»   » అల్లు అర్జున్‌కు జోడీగా మహేష్ బాబు హీరోయిన్!

అల్లు అర్జున్‌కు జోడీగా మహేష్ బాబు హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారిగా అల్లు అర్జున్ హీరోయిన్ సమంతతో జతకట్టబోతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్ష్ బేనర్లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

కాగా ఈచిత్రంలో మరో హీరోయిన్‌గా క్రితిసానన్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రతి సానన్ ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన '1' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సమంత, క్రితి సానన్‌తో పాటు మరో హీరోయిన్ కూడా ఈ చిత్రం ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.

Kriti Sanon to romance Allu Arjun

'1' సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో క్రితిసానన్‌‌కు తెలుగులో అసలు అవకాశాలే లేకుండా పోయాయి. మరి త్రివిక్రమ్-బన్నీ సినిమాలో అవకాశం వస్తే ఆమె దశ తిరుగుతుందో? లేదో? చూడాలి. క్రితి సానన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. 'హీరోపంతి' అనే చిత్రం ద్వారా క్రితి సానన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈచిత్రం ద్వారా ప్రముఖ హిందీ నటడు జాకీ ష్రాప్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

ఇక అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'రేస్ గుర్రం' ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. శృతి హాసన్ హీరోయిన్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Kriti Sanon may be casted opposite Allu Arjun in his upcoming movie. According to the buzz in the industry, Trivikram plans to rope Kriti Sanan for his upcoming film with Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu