For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ చెల్లి.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం గట్టి ప్లాన్లు

  |

  అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అనేక కష్టనష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా మారాడు రవితేజ. హీరోగా మారిన కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు దక్కించుకున్న రవితేజ మాస్ మహారాజా అనే బిరుదు కూడా దక్కించుకున్నాడు. కమర్షియల్ హీరోగా మారిపోయి స్టార్ స్టేటస్‌ అందుకున్న ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతూనే ఉన్నాడు. అయితే ఆయన తాజా సినిమా గురించి తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాలు

   కోలుకునేలా

  కోలుకునేలా

  చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్ల పాటు వరుస ప్లాపులతో ఇబ్బందులు పడిన రవితేజ గత ఏడాది మొదట్లో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రవితేజకు హిట్ ఇవ్వడమే కాదు తెలుగు సినిమాను కరోనా తరువాత కోలుకునేలా చేసింది.

  టైగర్ నాగేశ్వర రావు బయోపిక్

  టైగర్ నాగేశ్వర రావు బయోపిక్


  ఇక అలా ఆ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అయితే ఆయన నిరాశ చెందకుండా మరో మూడు సినిమాలు లైన్లో పెట్టారు. అందులో శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ', త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, అలాగే గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్.

  ఏప్రిల్ 2న

  ఏప్రిల్ 2న


  మిగతా రెండు సినిమాల సంగతి పక్కన పెడితే టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. రవితేజ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమగా చెబుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా కథానాయికగా తాజాగా నుపుర్ సనన్‌ను ఎంపిక చేశారు. తెలుగులో 'వన్ నేనొక్కడినే', 'దోచేయ్' సినిమాల్లో నటించి ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో హెరౌయిం గా నటిస్తున్న బాలీవుడ్ భామ కృతి సనన్‌కు నుపుర్ సొంత చెల్లెలు.

   హీరోయిన్ గా మొదటి సినిమా

  హీరోయిన్ గా మొదటి సినిమా


  అయితే ఎట్టకేలకు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో నుపుర్ సనన్ ఇప్పుడు టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఈ మధ్యనే నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్షయ్ కుమార్‌కు జోడీగా ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అలాగే నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా 'నూరాని చెహ్రా' అనే సినిమా చేశారు. అది హీరోయిన్ గా ఆమెకు మొదటి సినిమా. ఆ సినిమాకూడా విడుదల కాక ముందే ఆమె మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం దక్కించుకుంది.

  Who Is Tiger Nageswara Rao ? | Stuartpuram | Raviteja PanIndia | Filmibeat Telugu
  'ది కాశ్మీర్ ఫైల్స్'తో భారీ విజయం

  'ది కాశ్మీర్ ఫైల్స్'తో భారీ విజయం


  ఇక 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో 'ది కాశ్మీర్ ఫైల్స్'తో భారీ విజయం అందుకున్న అభిషేక్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వంశీ అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. ఉగాది రోజున సినిమా ప్రారంభించడమే కాదు. సినిమాను ప్రారంభించి, అదే రోజు ప్రీ లుక్ విడుదల చేసి అవకాశం ఉందని అంటున్నారు. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు కథతో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

  English summary
  Kriti Sanon's Sister Nupur Sanon Roped in for Ravi Teja's First Pan Indian movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X