ముందుగానే విడుదల అవుతున్న ‘క్రిష్ 3’
ముంబై: హృతిక్ రోషన్ హీరోగా రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్రిష్ 3'. హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అనుకున్న దానికంటే ముందుగా....నవంబర్ 1నే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని రాకేష్ రోషన్ ఖరారు చేసారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ 1నే సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ సారి దిపావళి పండగా ఆదివారం(నవంబర్ 3)న వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1న విడుదల చేయడం వలన సినిమాకు కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని ఆశిస్తున్నారు.
గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే విడుదలైన యూట్యూబ్ ట్రైలర్లకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ భారీ బడ్జెట్ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈచిత్రంలో హృతిక్ చేసే సాహసాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications












