twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్మురేపుతున్న ట్రైలర్, అప్పుడే కోటి దాటింది!

    By Bojja Kumar
    |

    ముంబై : హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన క్రిష్-3 ఫస్ట్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెల 5న విడుదలైన ట్రైలర్ పది రోజుల్లో 1 కోటి 20 లక్షలకు పైగా హిట్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ చాలా బాగుందనే టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

    ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట. సినిమాలో తన పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న వివేక్ ఆ బరువును లెక్కచేయకుండా ఇష్టపడి ఆ పాత్రలో అద్భుతంగా నటించాడట.

    గతంలో రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. క్రిష్-3 చిత్రంలో హృతిక్ రోషన్ సూపర్ మేన్ పాత్రలో కనిపించబోతునప్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈచిత్రం విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    The first trailer of superhero franchise Krrish 3 featuring Hrithik Roshan and Priyanka Chopra in the lead has received a roaring response from both fans and the film fraternity. The trailer has already crossed 12 million views in just 10 day of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X