అధిక ధరకు క్రిష్ తెలుగు డబ్బింగ్ హక్కులు
నిర్మాణంలో ఉన్న హిందీ చిత్రం క్రిష్ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులు అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఆంధ్రా, సీడెడ్ హక్కులను బిపిన్ షా కోటి రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. నైజాం ప్రాంతం హక్కులను యష్ చోప్రా కొనుగోలు చేశారు. కోయి మిల్‌గయా చిత్రానికి సీక్వెల్ అయిన క్రిష్‌లో హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, రాజేష్ రోషన్‌ల కాంబినేషన్‌లో వస్తోంది. ఈ చిత్రంలో రేఖ నాయనమ్మ పోషించడం విశేషం. హృతిక్ రోషన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా పాపులర్ కాబట్టి ఈ సినిమా బాగా ఆడుతుందన్న ఆశాభావాన్ని రాకేష్ రోషన్ వ్యక్తం చేశారు. ఈ సినిమా జూన్ 30న విడుదల కావల్సి ఉండగా దీనిని జూన్ 16 నే విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications