చిరంజీవి నిలదొక్కున్నారంటే అరవిందే: కేఎస్ రామారావు.. అశ్వినీదత్ కౌంటర్

By Rajababu

Recommended Video

Allu Aravind Speech At Tej I Love You Movie Press Meet

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మించిన చిత్రం 'తేజ్‌... ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అర‌వింద్ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా....

కరుణాకరన్ లవ్ మేజిషియన్

కరుణాకరన్ లవ్ మేజిషియన్

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``20 ఏళ్లుగా క‌రుణాక‌ర‌న్‌ ల‌వ్ మేజిషియ‌న్‌గా ఉండి.. ప్రేమ‌క‌థా చిత్రాలే చేస్తూ మ‌మ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌చ్చారు. మాకెన్నో బ్యూటీఫుల్ మూవీస్ ఇచ్చారు. నా కెరీర్‌లో ఓ ఇంపార్టెంట్ మూవీని క‌రుణాక‌ర‌న్‌, డైరెక్ట్ చేస్తే కె.ఎస్‌.రామారావు నిర్మించారు. ఇదొక‌ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. ప్ర‌తి రోజూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. మాకు స‌పోర్ట్ ఇచ్చిన కె.ఎస్‌.రామారావుకి థాంక్స్‌. ఆయ‌న మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. తప్పకుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

 రేడియో రామారావు అనే వారు

రేడియో రామారావు అనే వారు

చిత్ర నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ``నేను రేడియో సిటీలో పబ్లిసిటీ చేస్తున్న స‌మ‌యంలో రేడియో రామారావుగా, అంద‌రికీ ప‌రిచ‌యం ఉండేది. ఆ స‌మ‌యంలో గొప్ప నిర్మాత‌లైన అశ్వ‌నీద‌త్‌, అల్లు అర‌వింద్‌గారితో ప‌రిచ‌యం ఉండేది. అంత గొప్ప నిర్మాత‌ల స్థాయి కాక‌క‌పోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావ‌డం నా అదృష్టం. నా కంపెనీలో సినిమాలు చేసిన ద‌ర్శ‌కులు, హీరోల వ‌ల్ల‌నే నేను ఈ గొప్ప స్థితికి వ‌చ్చాను.

అశ్వినీదత్ సినిమాలు గ్రాండ్‌గా

అశ్వినీదత్ సినిమాలు గ్రాండ్‌గా

అశ్వ‌నీద‌త్‌గారి సినిమాల‌ను చూసి ఇంత గ్రాండ్‌గా సినిమాలు ఎలా చేస్తారో? అనుకుంటూ రేడియో ప‌బ్లిసిటీ చేస్తూ ఆయ‌న‌తో ట్రావెల్ చేశాను. మా కంటే చిన్న‌వాడైన అశ్వ‌నీద‌త్‌గారు పెద్ద హీరోలైన ఎన్టీఆర్‌గారితో సినిమాలు చేశారు. ఆయ‌న చేసే సినిమాల స్థాయి చూసి మేం అశ్చ‌ర్య‌పోయే వాళ్లం. ఆయ‌న సినిమాల‌ను అబ్జ‌ర్వ్ చేస్తూ కొంత నేర్చుకున్నాను.

అల్లు అరవింద్ ప్లానింగ్ గొప్పగా

అల్లు అరవింద్ ప్లానింగ్ గొప్పగా

నిర్మాత అర‌వింద్ ప్లానింగ్ చాలా గొప్ప‌గా ఉంటుంది. ఎక్క‌డా దుబారా కాకుండా సినిమాలు చేస్తారు. అలా ఆయ‌న సినిమాలను అబ్జ‌ర్వ్ చేయ‌డం జ‌రిగింది. అర‌వింద్‌గారు ఇంత సీనియ‌ర్.. ఇప్పుడు సోల్జ‌ర్స్‌లాంటి నిర్మాత‌ల‌ను త‌యారు చేస్తున్నారు. ఆయ‌న పెద్ద సైన్యాన్ని త‌యారు చేసుకుంటూ వ‌స్తున్నారు.

చిరంజీవి ఎదుగుదలకు కారణం

చిరంజీవి ఎదుగుదలకు కారణం

చిరంజీవి చాలా గొప్ప‌గా నిల‌దొక్కుకున్నారంటే ఫౌండేష‌న్ ప్లాన్ చేసిన వ్య‌క్తి అర‌వింద్‌గారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి 11 హీరోలున్నారు. కానీ అంద‌రూ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉన్నారంటే కార‌ణం అర‌వింద్‌గారి ప్లానింగే. అర‌వింద్‌గారు మాకెవ‌రికీ అంతుప‌ట్ట‌ని ప్లానింగ్ చేస్తారు అని అల్లు అరవింద్ అన్నారు.

 తేజ్ సినిమాకు కారణం సాయిధరమ్

తేజ్ సినిమాకు కారణం సాయిధరమ్

తేజ్ సినిమా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సాయిధ‌ర‌మ్ తేజ్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. క‌రుణాక‌ర‌న్‌గారు సినిమా చేయ‌డ‌మే కాదు.. మ్యూజిక్ విష‌యంలో కూడా ద‌గ్గ‌రుండి కేర్ తీసుకున్నాడు. మా సినిమాకు ప‌నిచేసిన డార్లింగ్ స్వామి, గోపీసుంద‌ర్‌, అండ్రూ అంద‌రికీ థాంక్స్ అని కేఎస్ రామారావు అన్నారు.

 కేఎస్ రామారావు చెప్పింది శుద్ధ అబద్ధం

కేఎస్ రామారావు చెప్పింది శుద్ధ అబద్ధం

స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ - ``కె.ఎస్‌.రామారావు న‌న్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాడినని చెప్పాడు కానీ.. అది శుద్ధ‌ అబ‌ద్ధం. ఎందుకంటే నేను మాంటిస్సోరి స్కూల్‌లో చ‌దువుకునే రోజుల్లో ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.ప్ర‌కాశ్‌రావు వ‌ద్ద రామారావు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పనిచేసేవారు. మా సూర్యారావు పేట‌లో ఆరోజుల్లో రామారావును క‌ల‌వ‌డం అంటే పెద్ద గ్లామ‌ర్‌గా ఫీల‌య్యేవాళ్లం. ఆయ‌న్ను చూసి ఎంతో గ‌ర్వ‌ప‌డ‌తాం. ఇవాళ‌కి కూడా ఆయ‌న సినిమాల్లో ఉన్నంత మ్యూజిక్ మ‌న సినిమాల్లో లేదేమో అని ఫీల్ అవుతుంటాను. ఆయ‌న్ను చూసి గ‌ర్వంగా ఫీల్ అవుతుంటాను. ఆయ‌న‌తో స‌హా ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

హీరో, నిర్మాతల సపోర్టు

హీరో, నిర్మాతల సపోర్టు

ఎ.క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ - ``తొలిప్రేమ నుండి ఈరోజు వ‌ర‌కు నేను చేసిన ఈ ప్ర‌యాణంలో నా హీరోలు, నిర్మాత‌లు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. వారు లేకుంటే నేను లేను. చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. త‌క్కువ సినిమాలే చేసినా.. పెద్ద పెద్ద నిర్మాత‌ల‌తో ప‌నిచేశాను. నేష‌న‌ల్ అవార్డ్ తీసుకున్న‌ప్పుడు ఎంత ఆనందంగా ఉందో.. ఇప్పుడు అంతే ఆనంద ప‌డుతున్నాను`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X