twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబా.. చిరంజీవా అనుకున్నారు.. అందుకే సినిమా కొనలేదు: నిర్మాత వ్యాఖ్యలతో కలకలం

    |

    తెలుగు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కేఎస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

    తమిళంలో 'కనా' అనే పేరుతో విడుదలై ఘన విజయం సాధించిన సినిమాను తెలుగులోకి రీమేక్ చేశారు. దీనికితోడు ఈ సినిమా క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 'కౌసల్య కృష్ణమూర్తి' ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

     KS Rama Rao Sensational comments on Producers

    ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్ రామారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 'కెరీర్‌ బిగినింగ్‌ నుంచి మంచి రచయితలు, కథలు, దర్శకులు కుదిరారు కాబట్టే నా బ్యానర్‌లో మంచి సినిమాలొచ్చాయి. ఆ గొప్పతనం నాది కాదు. నా బ్యానర్‌లో పని చేసిన వాళ్లది. ఈ చిత్రం నా బ్యానర్‌లో మరో మంచి సినిమా అవుతుంది.

    ప్రపంచవ్యాప్తంగా నేనే విడుదల చేస్తున్నా. నా సినిమా రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చిన మిత్రులకు, పెద్ద సినిమాలే రిలీజ్‌ చేస్తూ, ఈ చిత్రాన్ని కొనడానికి ముందుకురాని నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. సినిమాను అమ్మడానికి నేను ప్రయత్నించాను. కానీ, ఐశ్వర్యా రాజేశ్ అనే అమ్మాయి అమితాబ్ బచ్చనా..? చిరంజీవా..? అని అనుకున్నారేమో ఎవరూ ముందుకు రాలేదు' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    English summary
    Kousalya Krishnamurthy is an upcoming Telugu sport drama film, produced by K.A.Vallabha on Creative Commercials banner and directed by Bhimaneni Srinivasa Rao. The film stars Rajendra Prasad, Aishwarya Rajesh, Sivakarthikeyan in the lead roles and music composed by Dhibu Ninan Thomas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X