"క్షేమంగా వెళ్లి లాభంగా రండి" సీక్వెల్
రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ చిత్రంకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ చిత్రం తీసిన దర్శకుడు రాజా వన్నెం రెడ్డి ఈ సీక్వెల్ కి కథ,కథనం రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నటీ,నటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికి యంగ్ హీరోల్లా కనపడిన రాజేంద్రప్రసాద్ ఇప్పుడు వయస్సు మీదపడి తండ్రి వేషాలు వేస్తున్నారు. శ్రీకాంత్ వరస ఫ్లాఫ్ ల్లో ఉండి హిట్ కోసం చకోర పక్షి లా ఎదురుచూస్తున్నారు.
బ్రహ్మానందం అయ్యితే శ్రీను వైట్ల పుణ్యమా అని సినిమాల్లో సెకండ్ హీరోల్లా మారిపోయారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆయన ఉండాల్సిందే అన్న స్దితి వచ్చింది. ఈ నేఫద్యంలో వీరి డేట్స్ పట్టుకుని ఈ చిత్రం తీయటం కష్టమే. అందులోనూ అప్పట్లో ఈ చిత్రం రీమేక్. కథ,కథనం పటిష్టంగా ఉండటంతో ఆ రేంజి విజయం దక్కింది. ఇక రాజా వన్నెంరెడ్డి విషయానికి వస్తే ఆయనకు అప్పటినుంచి ఇప్పటివరకూ సరైన హిట్ లేదు. ఈ పదకొండేళ్లలో ఆయన తీసిన ఏ చిత్రమూ విజయవంతం కాలేదు. మొన్నటికి మొన్న తెలుగు అమ్మాయి అనే చిత్రం తీసారు. సలోని హీరోయిన్ గా వచ్చిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఇలాంటి పరిస్ధితిల్లో ఈ చిత్రం ఎలా ప్లాన్ చేస్తారన్నది చూడాల్సిన విషయమే.


Click it and Unblock the Notifications











