మహేష్-నమ్రత చేసే పనుల వల్ల మా ఇంట్లో ఒకటే గొడవ...మంత్రి కేటీఆర్ కామెంట్!
Recommended Video

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అను నేను' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించడం, పలు ప్రజా సమస్యలు, పాలనా పరమైన అంశాలను ఎంతో చక్కగా ఫోకస్ చేస్తూ దానికి పరిష్కారం చూపించేలా చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించి చిన్న చిట్ చాట్ కార్యక్రమం ఇటీవల నిర్వమించారు. ఈ సందర్భంగా కేటీఆర్-మహేష్ బాబు మధ్య ఆసక్తికర చర్చ సాగింది.

సినిమాలో ఆ సీన్ మీ జీవితానికి దగ్గరగా...
న్నగారు చేసే జాబ్ మన స్నేహితుల తండ్రుల కంటే పెద్ద జాబ్. నాయకుడిగా ఆయనపై ఎంతో పెద్ద బాద్యత ఉంది. అందుకే మనతో ఎక్కువ సమయం గడపలేక పోతున్నారు అని భరత్ తన తమ్ముడితో చెప్పే డైలాగ్.... ఈ చర్చా కార్యక్రమంలో మహేష్ బాబు గుర్తు చేశారు. సినిమాలో ఈ డైలాగ్ చెప్పినపుడు నేను చాలా రియలైజ్ అయ్యాను. రియల్ లైఫ్ పొలిటీషియన్స్ పిల్లలు తమ తండ్రిని ఎంత మిస్సవుతున్నారో అర్థం చేసుకున్నాను. మీరు ఇలాంటి జీవితం స్వయంగా అనుభవించారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మహేష్ బాబు అన్నారు.

చిన్నపుడు నాకు అర్థం అయ్యేది కాదు
దీనికి కేటీఆర్ స్పందిస్తూ... నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. చిన్నపుడు నాకు అర్థం అయ్యేది కాదు. ఎందుకు ఆయన సమయం మాతో గడపలేరు అనుకునేవాడిని. అపుడు నాన్నను చాలా మిస్సవుతున్న ఫీలింగ్ ఉండేది. అపుడు ఆయన మాకు ఎందుకు సమయం కేటాయించలేక పోయారో నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది. రేపు నా పిల్లలు కూడా పెద్దయిన తర్వాత ఈ విషయం అర్థం చేసుకుంటారు.... అని కేటీఆర్ అన్నారు.

మహేష్-నమ్రత హాలిడే ట్రిప్స్ గురించి మా ఇంట్లో ఒకటే గొడవ
పబ్లిక్, ప్రైవేట్ లైఫ్ టైమ్ డివైడ్ చేసి మాకు కొంత సమయం ఇవ్వొచ్చుకదా అని మా ఇంట్లో ఒకటే గొడవ. మహేష్ బాబు గారు ఇన్ని సార్లు హాలిడేకు వెళుతున్నారు... నమ్రత ఇన్ని పోస్టులు చేస్తోంది, నువ్వెందుకు తీసుకెళ్లవు అని ఇంట్లో గొడవ చేస్తుంటారు.... అని కేటీఆర్ అన్నారు.

మహేష్ బాబు రియాక్షన్
కేటీఆర్ అలా అనగానే వెంటనే మహేష్ బాబు మైక్ అందుకుని ‘మా జాబ్ కంటే మీ జాబ్ చాలా పెద్దది సార్... అందుకే అని చెప్పండి' అని వ్యాఖ్యానించారు. అలా అని చాలా మంది అనుకోవడం లేదు... అదే నా బాధ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











