నా రామ్ చరణ్ తెలుసా?.. కేటీఆర్ వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారక రామారావు మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్‌కు సంబంధించిన సినిమా ఈవెంట్స్‌కు కేటీఆర్ హాజరైన సందర్భాలెన్నో. వేదిక ఎక్కితే వీరిద్దరి బ్రొమాన్స్ ఎలా ఉంటుందో ఇది వరకే చూశారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి సినీ రాజకీయ వర్గాల్లో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రామ్ చరణ్‌ను నా రామ్ చరణ్ అని కేటీఆర్ సంబోధించడం చర్చనీయాంశమైంది. అసలు ఆ కథెంటో ఓ సారి చూద్దాం.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైద్రాబాద్‌లో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా గల్లీ గల్లీ తిరుగుతూ పరిస్థితిపై సమీక్షించారు. మొన్న వేములవాడలో పర్యటించిన కేటీఆర్.. నిన్న హైద్రాబాద్‌లో ప్రజల వద్దకు వెళ్లాడు. అందరినీ యోగ క్షేమాలు అడుగుతూ, కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాడు.

ఇందులో భాగంగా ఓ ఇంటి వద్ద ఆగిన కేటీఆర్.. 'అందరూ బాగానే ఉంటారు.. ఎవ్వరూ బయటికి వెళ్లకండి. మూతికి మాస్క్ వేసుకునే బయటికి వెళ్లాలి. మే 3 తారీఖు వరకు.. ఆ తర్వాత ఏమిటనేది తర్వాత చెబుతాం. పిల్లలు ఇంట్లోనుంచి కదులుతున్నారా? పోనియకండి. నీ కొడుకా..? ఏం పేరు.. అని అడుగగా.. రామ్ చరణ్ అని సదరు పిల్లాడు సమాధానం ఇచ్చాడు.. అవునా.. నా రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా..?' అని నవ్వులు పూయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











