Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కేటీఆర్ ప్రశంసలందుకున్న బయోపిక్.. విడుదలకు ముందే 'మల్లేశం' హవా
అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి చింతకింది మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మల్లేశంగారి సొంతం. ఇందుకు గాను ఈయనకు పద్మ శ్రీ అవార్డు కూడా లభించింది. ఇంతటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాజ్ మల్లేశం సినిమా తెరకెక్కించారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
ఈ చిత్రంలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించగా.. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలకపాత్రల్లో నటించారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 'మల్లేశం' పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..''మల్లేశం సినిమాను పూర్తి చేయడంలో సూర్యుల్లాగా చాలా మంది పనిచేశారు. వారందరికీ అభినందనలు. ఈ సినిమాలో చాలా మానవీయంగా, సహజంగా, అద్భుతంగా మానవ ఉద్వేగాలను చక్కగా క్యాప్చర్ చేశారు. ఓ సామాన్యుడి ప్రతిభా పాటవాన్ని ఆవిష్కరించే క్రమంలో ఎన్ని కష్టనష్టాలుంటాయో తెలియజేసేలా చిత్రీకయించిన ఈ సినిమాలోని సన్నివేశాలు నా హృదయానికి చాలా దగ్గరయ్యాయి. భారతదేశంలో చేనేత కార్మికులు పడే కష్టం మరుగున పడిపోతున్న కళగా అంతరించి పోతున్న ఈ తరుణంలో వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ వారి కష్టనష్టాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు.
చేనేత కళాకారుల ఆత్మహత్యలను, స్థితిగతులను చూపెడుతూ, ఈ వృత్తిలో రాణించాలంటే ఉండే కష్టనష్టాలను చూపుతూ, అందులో భాగంగా ఓ రూరల్ ఇన్వెంటర్ జీవితాన్ని చూపించారు. ఒక కొత్త ఆవిష్కరణను చేయాలనుకున్నప్పుడు ఓ వ్యక్తికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. దాన్ని తట్టుకుని అధిగమిస్తూ ఎలా సక్సెస్ కావాలనే దానికి కూడా ఈ సినిమా అద్భుతమైన ప్రేరణగా నిలుస్తుంది. అన్ని దారులు మూసుకుపోయినా, ఏదో ఒకదారి తెరుచుకుని ఉంటుందనే విషయాన్ని చక్కగా వివరించింది మల్లేశం సినిమా. మల్లేశం దర్శక నిర్మాతలకు, ఇతర యూనిట్ అభినందనలు'' అని అన్నారు.