ఆర్జీవీకి అదిరిపోయే కౌంటర్.. కేటీఆర్ పంచ్ అదుర్స్.. ఇరువురి ట్వీట్స్ వైరల్
రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎలా అర్థం కాకుండా ఉంటాడో.. ఆయనే వేసే ట్వీట్స్ కూడా అలానే ఉంటాయి. అయినా అందరిలా సాధారణంగా మాట్లాడితే, ట్వీట్స్ వేసే అతన ఆర్జీవి ఎందుకు అవుతాడు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే వర్మ తాను అనుకున్నదే చేస్తాడు. తాజాగా వర్మ వేసిన ఓ ట్వీట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఓ రేంజ్ వైరల్ అవుతోంది. ఓ సారి వాటి కథేంటో చూద్దాం.
Recommended Video

నెటిజన్లతో చిట్ చాట్..
ఓ వైపు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు శ్రమించడం, మరోవైపు ప్రజల కష్టాలకు స్పందించి వారికి సాయం చేయడంలో తలమునకలై ఉంటాడు కేటీఆర్. నిత్యం కొన్ని వేల వినతులు సోషల్ మీడియా ద్వారా కేటిఆర్‌కు వస్తుంటాయి. క్షణాల్లో స్పందించి.. నిమిషాల్లో వాటిని పరిష్కరిస్తుంటాడు. అంత బిజీగా ఉండే కేటీఆర్ నిన్న సాయంత్రం నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు.

ఎంతోమంది ప్రశ్నలకు..
ఆస్క్ కేటీఆర్ పేరిట ఎంతో మంది నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు సంధించారు. కొందరు వ్యక్తిగత విషయాలను అడిగితే మరికొందరు.. కరోనా పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు, ఇంకొందరు కేటీఆర్, కేసీఆర్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఓ వింత విన్నపాన్ని చేశాడు.
వర్మ వినతి..
కరోనా సమయంలో మందు బాబుల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. మందు లేక కొందరు అల్లల్లాడిపోతోన్నారు. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్థావిస్తూ.. ‘ఇళ్లల్లో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్నారు. చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారు. మెంటల్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫస్ట్రేషన్ లో కొందరు భర్తలు భార్యల్ని కొడుతున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతలా పెద్ద మనసు చేసుకొని మాకు చీర్స్ చెప్పండ'ని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

కేటీఆర్ పంచ్..
వర్మ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ అదిరిపోయే జవాబిచ్చాడు. బెంగాల్‌లో మాదిరి మద్యాన్ని డోర్ డెలివరీ చేయడం గురించి.. కానీ అదేమీ తెలియనట్టు కేటీఆర్ కౌంటర్ వేశాడు. రాముగారు మీరు అడుగుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటున్నా.. అంటూ రిప్లై ఇచ్చాడు. దెబ్బ అదుర్స్ కదా అంటూ రజినీ స్టైల్లో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications










