జాతిరత్నాలు సినిమాపై కేటీఆర్ కామెంట్.. ఒక్క మాటతోనే క్లారిటీ ఇచ్చేశారు

స్టార్ క్యాస్ట్ లేకపోయినా కూడా కంటెంట్ బావుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయవచ్చని జాతిరత్నాలు సినిమా నిరూపించింది. లాక్ డౌన్ తరువాత విడుదలైన బెస్ట్ కామెడీ సినిమాగా న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై కొంతమంది ప్రముఖులు పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణ మాంత్రి కేటీఆర్ కూడా సినిమాపై స్పందించారు.

Recommended Video

Allu Arjun మెప్పు పొందిన జాతి రత్నాలు | Naveen Polishetty రియాక్షన్
మొదటి వారంలోనే

మొదటి వారంలోనే

ప్రముఖ వైజయంతి బ్యానర్ నుంచి వచ్చిన స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో రూపొందిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించగా అనుదీప్ డైరెక్ట్ చేశాడు. సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది. మొదటి వారంలోనే సినిమా బ్రేక్ ఈవెబ్ టార్గెట్ ను ఫినిష్ చేసింది.

నాన్ స్టాప్ నవ్వులతో..

నాన్ స్టాప్ నవ్వులతో..

నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి సపోర్టింగ్ కమెడియన్స్ గా మెప్పించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నాన్ స్టాప్ గా నవ్వించినట్లు ఆడియెన్స్ ను పాజిటివ్ కామెంట్స్ అందుకుంది. అదే విధంగా సినీ ప్రముఖులు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే తరహాలో స్పందించారు.

 స్పందించిన కేటీఆర్

స్పందించిన కేటీఆర్

మహేష్ బాబు కూడా సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఇటీవల కేటీఆర్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించి పలు సమస్యలకు పరిష్కారాలను అందజేశారు. సమస్యలపైనే కాకుండా ఫ్రెండ్లిగా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు.

జాతిరత్నాలు ఎలా ఉందంటే..

జాతిరత్నాలు ఎలా ఉందంటే..

అదే విధంగా జాతిరత్నాలు సినిమాను చూశారా? అని అడిగిన ఒక నెటిజన్ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చారు. జాతిరత్నాలు సినిమా చాలా బాగా నచ్చింది అంటూ.. సినిమా చాలా సరదాగా ఉందని స్మైల్ ఎమోజీతో ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇటీవల జాతిరత్నాలు సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X