twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ చెప్పినట్లుగా... : మంత్రి కేటీఆర్

    By Srikanya
    |

    హైదరాబాద్: శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు చెప్పినట్లు దత్తత తీసుకోవడమంటే చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోవడం కాదు.. పని అయ్యేదాకా ఉండడం. సమస్యలన్నింటినీ పరిష్కరించడం అని అన్నారు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు( కేటీఆర్).

    హైదరాబాద్‌ మహానగరాన్ని దత్తత తీసుకోబోతున్నా. నగరంలోని కోటి మంది ప్రజలకు చేదోడువాదోడుగా పెద్దన్నగా ఉంటాను. . ఏ సమయంలోనైనా పిలిస్తే పలుకుతా. అభివృద్ధి పేరుతో నాలుగు గోడలకు రంగేసి, నాలుగు రోడ్లు నిర్మించి వెనక్కిపోను. మంచీ చెడులనూ దత్తత తీసుకుంటా అన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    మరో ప్రక్క మహేష్ శ్రీమంతుడు చిత్రం తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ శ్రీమంతుడు విడుదలై మొన్నటితో సిల్వర్ జూబ్లీ(175 రోజులు) కూడా పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం విడుదలై 200 రోజులు పూర్తి చేసుకోబోతోంది.

    Ktr remembers Mahesh babu's Srimanthudu

    అప్పుడు మహేష్ బాబు చేసిన హడావుడి ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనా...? లేక తన సినిమా పబ్లిసిటీకోసమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాల ప్రజలు మహేష్‌పై తీరుపై అసహనంగా ఉన్నారనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

    గతంలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ ఆ గ్రామానికి రావడం కాని, కనీసం వారి బాగోగులు కూడా పట్టించుకోవడం లేదని సిద్దాపూర్ గ్రామస్థులు ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మా గ్రామానికి ఎప్పుడు వస్తారు, మా జీవితాలను ఎప్పుడు బాగు చేస్తారు అని అక్కడి వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే వార్తలు ప్రముఖ పత్రికల్లో రావడం గమనర్హం.

    English summary
    KTR, Minister for Panchayatraj, Rural Development & Information Technology, Telangana again remebers Srimanthud Movie. KTR successfully persuaded Mahesh Babu to adopt Siddhapuram village in Mahaboobnagar district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X