ఉపాసన, రామ్ చరణ్‌కు థాంక్స్ చెబుతూ కేటీఆర్ ట్వీట్
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో సినీ ప్రముఖుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబుతో పాటు పలువురు టాప్ స్టార్స్ కేసీఆర్, కేటీఆర్‌లకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

సినీ సెలబ్రిటీల ట్వీట్లకు కేటీఆర్ పర్సనల్‌గా రిప్లై ఇస్తూ థాంక్స్ చెబుతున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన... టీఆర్ఎస్ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా కేటీఆర్ స్పందించారు. మీకు, చరణ్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 సీట్లకుగాను 88 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి తెలంగాణలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ప్రతిపక్షాల అంచనాలను తలక్రిందులు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.
ఒకప్పుడు హైదరాబాద్ ఏరియాలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికల్లో భాగ్యనగరాన్ని సైతం గులాబీ మయం చేసింది. గత నాలుగేళ్ల పాలనలో హైదరాబాద్లో ఉన్న సెటిలర్లు సైతం ప్రభుత్వ పాలనతో పూర్తి సంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











