twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ ట్వీట్స్: రామ్ చరణ్ భార్య ఉపాసన రిక్వెస్ట్.... వెయిట్ చేయాలన్న కేటీఆర్!

    |

    రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదు... ఇటు సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె అంధ బాలికల వసతి విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు.

    అదే చీర.. అదే నేను.. 14 కేజీలు బరువు తగ్గిన ఉపాసన!అదే చీర.. అదే నేను.. 14 కేజీలు బరువు తగ్గిన ఉపాసన!

    అంధ బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది. దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం. హాస్టల్ కోసం కూడా మంచి భవనం సాంక్షన్ చేస్తే మరింత సంతోషిస్తాని శైలజా రాణి ఆ వీడియో ద్వారా కోరారు.

    ఉపాసన రిక్వెస్ట్

    ఉపాసన రిక్వెస్ట్

    ఉపాసన ట్వీట్ చేస్తూ... ప్రియమైన తెలంగాణ ప్రభుత్వం. మీరు గొప్పగా పని చేస్తున్నారు. కానీ మీ నుంచి మరింత సహాయం అవసరం. ఈ బాలికల కోసం సహాయం చేయండి. నా వంతు సేవ నేను చేస్తున్నాను. దయచేసి వీరికి ఒక హాస్టల్ భవనం సాంక్షన్ చేయండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్న సింబల్‌తో కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

    కేటీఆర్ ఏమన్నారంటే...

    కేటీఆర్ ఏమన్నారంటే...

    ఉపాసన రిక్వెస్ట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.... స్కూలు భవనం మంజూరైనందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే హాస్టల్ భవనం కూడా సాంక్షన్ చేస్తాం. అయితే మీరు డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలి అని కోరారు.

    దిపావళి కానుకలు

    దీపావళి సందర్భంగా ఉపాసన అంధ బాలికల కోసం కొత్త దుస్తువులను కానుకగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

    వారికి సేవ చేయడంలో ఎంతో తృప్తి

    ఈ అమ్మాయిలకు సేవ చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వీరి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. వీరి ప్రతిభ చూస్తే మీరు ఆశ్చపోవడం ఖాయం అని ఉపాసన పేర్కొన్నారు.

    రామ్ చరణ్, పని, సేవ

    రామ్ చరణ్, పని, సేవ

    తన వృత్తి జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన.... మిగతా సమయాన్ని రామ్ చరణ్‌తో గడిపేందుకు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వినియోగిస్తుంటారు. ఉపాసన చేస్తున్న ఈ కార్యక్రమాలపై మెగా అభిమానుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    English summary
    Telangana minister KTR, has responded to the request of Ram Charan's wife Upasana and assured to sanction a hostel for girls after the formation of new government in the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X