టీఆర్ఎస్ నేత కేటీఆర్ రివ్యూ.. ఆ సినిమా గురించి ఓపెన్‌గా చెప్పేశాడు!
Recommended Video

టీఆర్ఎస్ నేత కేటీఆర్ సినిమా వాళ్లతో చాలా సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. రాజకీయ, పాలన వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తూ తన అభిప్రాయాన్ని చాలా ఓపెన్‌గా చెప్పేస్తుంటారు.
కన్నడ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కెజిఎఫ్' చిత్రాన్ని తాజాగా కేటీఆర్ వీక్షించారట. సినిమా చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా తన రివ్యూ చెప్పేశాడు. ఈ సినిమా తనకు ఎంత నచ్చిందో వివరిస్తూ ట్వీట్ చేశారు.

కేటీఆర్ రివ్యూ
‘కాస్త లేటైనా ఎట్టకేలకు ‘కెజిఎఫ్' చిత్రం చూశాను. వావ్ ఏం మూవీ అనేలా ఉంది. టెక్నికల్‌గా బ్రిలియంట్, కూల్ అండ్ ఇంటెన్స్ మూవీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్. కన్నడ రాక్ స్టార్ యష్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కన్నడ సినీ చరిత్రలో ఓ సంచలనం
‘కెజిఎఫ్' చిత్రం కన్నడ సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. కన్నడనాట రూ. 100 కోట్ల వసూళ్లు దాటిన తొలి సినిమా ఇది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళంలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్లకుపైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

తెలుగులోనూ అదరగొట్టింది
ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి టోటల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 12.30 కోట్లు రాబట్టింది. సినిమా రైట్స్ రూ. 5 కోట్లకు అమ్ముడవ్వగా రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. కన్నడ డబ్బింగ్ చిత్రానికి తెలుగులో ఇంత షేర్ రావడం రికార్డ్.

కెజిఎఫ్ చాప్టర్ 2
త్వరలో కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 చివరి వరకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











