నేనొచ్చాను ధ్రువ హిట్.. రంగస్థలంపై నాకు అనుమానం.. పవన్ గురించి కేటీఆర్ కామెంట్

రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..

సముద్రమంతా అభిమానంతో

సముద్రమంతా అభిమానంతో

అందరికీ నమస్కారం. ముందుగా స్వయంకృషితో టాలీవుడ్‌కు, భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజం. సముద్రమంత అభిమానాన్ని, అద్భుతమైన వారసులను అందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి. రాంచరణ్ తన ప్రసంగంలో ఏదీ మర్చిపోలేదు. రాజకీయాల్లో మేము మాట్లాడే దానికంటే బాగా మాట్లాడాడు. త్వరలోనే పాలిటిక్స్‌లోకి వస్తాడేమో అనిపిస్తున్నది. దానికి ఇంకా టైమ్ ఉంది.

 ధ్రువ సినిమా ఫంక్షన్ వస్తే

ధ్రువ సినిమా ఫంక్షన్ వస్తే

నేను ధ్రువ సినిమా ఫంక్షన్‌కు వచ్చాను. అది హిట్ అయ్యింది. రంగస్థలం ముందు మేము ఒకచోట కలిశాం. అప్పుడు గడ్డంతో కనిపించాడు. ఏంటనీ అడిగితే రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నాని చెప్పాడు. అయితే అర్భన్ బ్యాక్ డ్రాప్‌లోనే సినిమా చేయాలని సూచించాను. కానీ రంగస్థలం చూశాక రాంచరణ్ కెరీర్‌లోనే అద్బుతమైన సినిమాగా నిలిచింది.

రంగస్థలాన్ని వాడుకొన్నాను

రంగస్థలాన్ని వాడుకొన్నాను

రంగస్థలం సినిమాలోని పాటలను ఎన్నికల్లో బాగా వాడుకొన్నాను. ఆ గట్టున ఉంటావా.. ఈ గట్టున ఉంటావా.. నాగన్న.. రాజన్నా అని తెల్చుకోవాలని కోరాను. ఓటర్లంతా నా మాటకు ఓటర్లు బాగా స్పందించి ఘనమైన విజయాన్ని అందించారు. ఎన్నికల సమయంలో దేవీ శ్రీ ప్రసాద్ నా పాటను వాడుకొంటున్నారు అని మెసేజ్ చేశారు. దానికి నేను సమాధానం ఇస్టూ నీ పాటకు రెమ్యునరేషన్ ఇవ్వలేను అని చెప్పాను.

వినయ, విధేయ రామ ఎవరంటే

వినయ, విధేయ రామ ఎవరంటే

వినయ విధేయ రామలో ఎవరు వినయంగా ఉంటారు. ఎవరు విధేయంగా ఉంటారు అని చిరంజీవిగారితో అడిగాను. కానీ ఆయన ట్రైలర్ చూస్తే తెలుస్తుందన్నారు. కానీ ట్రైలర్ చూస్తే విధ్వంస రాముడు మాత్రమే కనిపించారు. అయితే సినిమాలో వినయ విధేయ రాముడు కనిపిస్తారేమో చూడాలి. సాధారణంగా నేను ఇలాంటి సినిమాలు చూడను కానీ బోయపాటి కోసం నేను ఈ సినిమా చూస్తాను.

పవన్ కల్యాణ్ సినిమాల్లో కొనసాగాలే

పవన్ కల్యాణ్ సినిమాల్లో కొనసాగాలే

పవన్ కల్యాణ్ ఇక్కడ లేరు. కానీ ఈ మధ్యన ఆయనతో ఇటీవల రెండు మూడు సార్లు మాట్లాడాను. ఆయన సినిమాలో కొనసాగుతూనే.. రాజకీయాల్లో కూడా ఉండాలని కోరుకొంటున్నాను. ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు. రెండు రంగాల్లో కూడా విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగించాలని కోరుకొంటున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X