'కుచేలుడు' ఆడియో డేట్...

ఇక సినిమా విడుదల తేదీని జూలై 18గా ఖరారు చేశారు. అయితే ఈ సినిమాను జూలై 18న విడుదల చేయాలనుకోవడం వెనుక ఒక కారణముంది. ఆరోజు 'కుచేలుడు' విడుదలైతే, 100వ రోజు దీపావళి పండుగ వస్తుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయడానికి దర్శకుడు వాసు రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. కాగా ఈ సినిమాలోని రజనీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని దళేర్ మెహంది పాడుతుండటం గమనార్హం. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో అశ్వనీదత్, తమిళంలో బాలచందర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











