వెరైటీ గెటప్ లో రజనీ

జగపతిబాబు టైటిల్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఆయన చేస్తున్నది సినీ హీరో పాత్ర. ఆ పాత్రకు తగ్గట్లు ఆయన ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరిస్తున్నాడు. ఒక పాటలో అయితే ఆయన ఏకంగా 20 గెటప్పులలో కనిపించనున్నాడు. ఆ గెటప్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ పాటలో ఆయన సరసన నయనతార సహా చాలామంది తారలు కొద్దిసేపు మెరుపులు మెరిపించనున్నారు. ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్ హీరోయిన్ . సి. అశ్వనీదత్, విజయ్‌కుమార్ నిర్మాతలు. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 18న విడుదలవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











