కుచేలుడులో త్రిష లేదు

ప్రస్తుతం కుచేలుడు రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో జగపతిబాబు మంగలిగానూ, రజని సూపర్ స్టార్ గానూ కనిపిస్తారు. మరో ప్రక్క ఈ సినిమా కార్పొరేట్ కంపెనీల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. సినిమాలో తన పాత్ర కనిపించేది 25 శాతంలోనేనని స్వయంగా రజనీకాంత్ వెల్లడించినా ఆ కంపెనీలు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అందుకే ఇటు తెలుగు, అటు తమిళ వెర్షన్ల పంపిణీ హక్కుల కోసం అవి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వాటిల్లో యాడ్‌లాబ్స్, పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ వంటివున్నాయి. ఈ చిత్రంలో త్రిష లేక పోయినా నయనతార, మమతా మోహన్‌దాస్ లతో సహా పలువురు పాపులర్ హీరోయిన్లు కనపడి అలరించబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











