twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నాట్‌ లక్కీ' హీరో అతనే!

    By Staff
    |

    Avasarala Srinivas
    అష్టాచెమ్మా చిత్రంలో రెండవ హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ గురించి పరిశ్రమ మొత్తం మెచ్చుకుంది. కొందరైతే మరొక అడుగు ముందుకేసి అతనితో సినిమాలు తీస్తామని సంప్రదించారు. అయితే అతను స్క్రిప్టు నచ్చనిదే ఏదీ చెయ్యనని ఆగాడు. తాజాగా అతను నాట్ లక్కీ అనే చిత్రం కమిటయ్యాడు. 'మొదటి సినిమా', 'జాన్‌ అప్పారావ్‌ 40+' చిత్రాలు రూపొందించిన దర్శకుడు కూచిపూడి వెంకట్‌ ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నాడు. నిజానికి కూచిపూడి వెంకట్ తీసిన రెండు చిత్రాలు విభిన్నత ప్రదర్శించినా స్క్రిప్టు బలహీనం వల్ల హిట్ అందుకోలేకపోయాయి. అయితే నాట్ లక్కి మాత్రం కసిగా మొదలుపెడుతున్నట్లు సమాచారం.

    ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ "ఓమ్‌ అనే ఒక నూతన నటుడు చిత్రంలో ఒక కీలక పాత్రను చేయనున్నారు. మిగతా నటుల్లో అమెరికాలోని భారతీయులు కూడా ఉంటారు. నేటి మానవ సంబంధాలు, మారుతున్న ధోరణుల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. హైదరాబాద్‌లో జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నది. ఎక్కువ భాగం సినిమాని అమెరికాలో చిత్రీకరిస్తాం" అని ఆయన చెప్పారు.ఈ సారన్నా అనుకున్న టైటిల్ రివర్స్ అయి లక్ చేకూరాలని కూచిపూడి వెంకట్ నిలబడాని కోరుకుందాం. నీలకంఠ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కిరణ్‌ వారణాసి, నిర్మాత: కె. సతీష్‌చంద్ర, రచన, దర్శకత్వం: కూచిపూడి వెంకట్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X