విడుదలకు సిద్దమైన వరుణ్ సందేశ్ కుదిరితే కప్పు కాఫీ
యూత్ హీరో వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య హీరో హీరోయిన్లుగా శివ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ మరియు మూన్ వాటర్ పిక్చర్స్(ప్రై) లిమిటెడ్ పతాకంఫై రమణ సాల్వ దర్శకత్వంలో యువ నిర్మాతలు శివ, మహి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం 'కుదిరితే కప్పు కాఫీ'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు శివ, మహి మాట్లాడుతూ 'అందర్నీ అలరించే కధ, కధనాలతో చక్కని ప్రేమకధా చిత్రంగా రూపొందుతున్న 'కుదిరితే కప్పు కాఫీ' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అబ్బాయి యోగేస్వర్ శర్మ అందించిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటల్ని దర్శకుడు రమణ సాల్వ అద్భుతంగా పిక్సరైజ్ చేశారు. చాల రేర్ లోకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాటలు ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ గా నిలుస్తారు. మా బేనర్ లో ఈచిత్రం ఒక అపురూప చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం మాకు వుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











