twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Samantha పరువు నష్టం దావా కేసు.. కోర్టు కీలక ఆదేశాలు.. తీర్పు ఏమిటింటే

    |

    గత కొద్దిరోజులుగా సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుంచి కూడా అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఊహించినట్లుగానే విడాకులు ప్రకటన రానే వచ్చింది. విడాకులు ప్రకటన వచ్చినప్పటి నుంచి సమంతను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద సమంతా కోర్టుకు వెళ్లగా ఈరోజు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    ఎంత రచ్చ జరిగినా?

    ఎంత రచ్చ జరిగినా?

    అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ అనూహ్యంగా సోషల్ మీడియా ఖాతాల్లో అక్కినేని సమంత అని ఉండే పేరులో అక్కినేని తీసేసి సమంత అని పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇంకేముంది అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అది ఈ విషయం మీద చాలా రోజుల వరకు నాగచైతన్య సమంత గాని లేదా వారి తరపున ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.

    అక్టోబర్ 2న

    అక్టోబర్ 2న

    అయితే అనూహ్యంగా అక్టోబర్ 2వ తేదీన తాము అధికారికంగా విడిపోతున్నాం అని నాగచైతన్య, సమంత ఒకే సమయంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారు ప్రకటించినప్పటి నుంచి ఎక్కువ మంది సమంతదే తప్పు అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆమెకు ఎఫైర్లు ఉన్నాయని కొందరు, ఆమె పెళ్లి చేసుకున్నా పిల్లలను కనడానికి సిద్ధంగా లేదని మరికొందరు ఇలా ఎవరికి తోచిన కారణాలు చెబుతూ వచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం గురించి చెప్పక్కర్లేదు.

    నన్నెవరూ తొక్కలేరు

    నన్నెవరూ తొక్కలేరు

    ఇంత దుష్ప్రచారం జరుగుతోందని చెబుతూ సమంత సోషల్ మీడియా వేదికగా మళ్ళీ స్పందించింది. నన్ను తొక్కాలని చూస్తున్నారు అయినా నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లు కామెంట్ చేసింది. అయినా సరే ఈ దుష్ప్రచారం ఆగకపోవడంతో ఆమెకే ఎట్టకేలకు కోర్టుకు వెళ్లింది. ఒక మూడు యూట్యూబ్ ఛానల్స్ ఒక డాక్టర్ తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతూ ఆమె పరువు నష్టం దావా దాఖలు చేసింది. సమంత కూకట్పల్లి కోర్టులో పరువునష్టం దావా వేయగా దానికి సంబంధించి కొద్ది రోజుల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి.

     సమంత కంటెంట్ తీసేయండి

    సమంత కంటెంట్ తీసేయండి

    తాజాగా ఇప్పుడు హీరోయిన్ సమంతకు కూకట్పల్లి కోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన 3 యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానెళ్లు వెంటనే కంటెంట్ తొలగించాలని ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసింది. అయితే అందుకు అనుగుణంగా తన వ్యక్తిగత విషయాలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని న్యాయస్థానం పేర్కొంది. సమంత వ్యక్తిగత వివరాలూ ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Siri ఫ్యూచర్ Shannu చేతిలో.. పాపం Lobo || Filmibeat Telugu
     కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

    కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

    గతంలో కూడా కోర్టు ఇదే విధంగా స్పందించింది. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే కదా ఇంత చర్చ జరుగుతోందని, ఆమె ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించకుండా ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదని అభిప్రాయపడింది. అలాగే సమంత స్పెషల్ పర్సన్ గా భావించి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని జడ్జిని కోరగా చట్టం ముందు అందరూ సమానులే అని కూడా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అలాగే పరువు నష్టం దావా వేయడాని కంటే ముందు క్షమాపణ కోరచ్చు కదా అని కూడా కోర్టు సూచించింది. కానీ సమంత న్యాయవాది మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇక ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సమంత న్యాయవాది ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    Kukatpally court crucial gave orders on Samantha defamation case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X