Samanthaకి బిగ్ షాక్.. అందరూ సమానులే, పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఇప్పుడిలానా? కోర్టు షాకింగ్ కామెంట్స్!
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత తనకు వ్యతిరేకంగా, తన మనోభావాలను కించపరిచే విధంగా అనేక కథనాలు వస్తున్నా క్రమంలో సమంత ఒకసారి సోషల్ మీడియా వేదికగా ఇక వదిలేయమని కోరింది. అయినా వెనక్కు తగ్గకపోవడంతో అలాంటి యూట్యూబ్ ఛానెల్స్‌పై సమంత రుత్ ప్రభు ఘాటుగా స్పందించారు. రెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేశారు. తన విడాకులకు కారణమంటూ అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయం మీద కోర్టులో వాదనలు ముగిశాయి. అసలు కోర్టు ఏమండి అనే విషయంలోకి వెళితే

కోర్టు ముందు అందరూ సమానులే
కూకట్ పల్లి కోర్టులో సమంత పిటిషన్ త్వరితగతిన విచారించాలని కోర్టును సమంత తరఫు న్యాయవాది కోరారు. సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్న సమంతను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోరారు. అయితే షాకింగ్ గా కోర్టు ముందు అందరూ సమానులేనన్న న్యాయమూర్తి, సామాన్యులు అయిన సెలబ్రిటీలు అయిన న్యాయస్థానం ముందు ఒక్కటేనని తేల్చి చెప్పారు. కోర్టు సమయం చివర్లో విచారిస్తామన్న కూకట్ పల్లి కోర్ట్ అలాగే విచారించింది.

రేపటికి వాయిదా
అలా కూకట్ పల్లి కోర్ట్ లో సమంత దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిసిన నేపథ్యంలో ఈరోజు తీర్పు ప్రకటించవచ్చని భావించారు కానీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. సమంత పిటిషన్‌పై విచారణ పూర్తి కాగా తీర్పు రేపటికి వాయిదా వేసింది కూకట్‌పల్లి కోర్టు.

క్షమాపణలు కోరవచ్చు కదా
సమంత ప్రతిష్ఠను దెబ్బతీసిన రెండు యూట్యూబ్ ఛానెల్స్ , డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ మీద చర్యలు తీసుకోవాలని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోరారు. అయితే తప్పు జరిగిందని భావిస్తే పరువు నష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కోరవచ్చు కదా అని కోర్టు పేర్కొంది.

పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే
అంతే కాక సెలబ్రిటీ ల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే... పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని కోర్టు ప్రశ్నించింది. దానికి న్యాయవాది మాట్లాడుతూ సమంత విడాకులు ఇంకా తీసుకోలేదు... ఆ లోగా ఆమె మీద ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరం అని న్యాయవాది బాలాజీ వాదించారు.

అక్రమ సంబంధాలు అంటగట్టి
సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారు...ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టి రచ్చ చేశారు అంటూ న్యాయవాది బాలాజీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా ...పర్మినెంట్ ఇంజన్క్షన్ ఇవ్వాలని కోర్టును సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోరారు.
Recommended Video

క్షమాపణ చెప్పాల్సిందే
యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను డిలీట్ చేయడమే కాకుండా, అన్‌కండిషనల్‌గా క్షమాపణ చెప్పాల్సిందిగా పిటిషన్ లో కోరామని ఆమె తరపు లాయర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆమెపై కానీ ఆమె కుటుంబం పై కానీ ఎటువంటి దుష్ప్రచారం చేయకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు వివరించారు. సమంత డబ్బు కోసం కేసులు వేయలేదని, రాజ్యాంగం తన హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











