హాట్ టాపిక్: కుమారస్వామి వైఫ్ గురించి నిజాలు.. నందమూరి హీరో సినిమాలో, ప్రేమలోకి దించి!

Recommended Video

Later Karnataka Elections Kumaraswamy Wife Became A Hot Topic

కుమారస్వామి భార్య రాధిక గురించి మాట్లాడుకునేముందు కన్నడ రాజకీయాల గురించి ఓ విషయం ప్రస్తావించాలి. వందకు పైగా స్థానాలు కైవసం చేసుకున్న బిజెపికి, 70కి పైగా స్థానాలు గెలుచుకున్నా కాంగ్రెస్ కు దక్కని అవకాశం కేవలం 38 స్థానాలు గెలుచుకున్న కుమారస్వామికి దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్న కుమారస్వామి హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉంచితే ఆయన భార్య రాధికా కూడా జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం విశేషం. సోషల్ మీడియాలో నెటిజన్లు రాధికా గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు ఆమె అందాల హీరోయిన్. తెలుగు సహా పలు దక్షణాది చిత్రాలలో ఆమె నటించింది.

 32 చిత్రాల్లో హీరోయిన్‌గా

32 చిత్రాల్లో హీరోయిన్‌గా

రాధిక 32 చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయం ఉన్న నటిగా మెప్పించింది. నినాగాగి అనే కన్నడ చిత్రంతో 2002 లో రాధిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

నందమూరి హీరోతో రొమాన్స్

నందమూరి హీరోతో రొమాన్స్

రాధికా నటించిన తొలి తెలుగు చిత్రం భద్రాద్రి రాముడు. నందమూరి హీరో తారకరత్న నటించిన ఈ చిత్రం 2004 లో విడుదలయింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రాధికకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

కుమారస్వామితో ప్రేమలో

కుమారస్వామితో ప్రేమలో

సినిమాలలో నటిస్తున్న తరుణంలో కుమారస్వామితో రాధికకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2006 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరో వివాహం అప్పట్లో హాట్ టాపిక్. వీరిద్దరికి వయసులో వ్యత్యాసం 17 ఏళ్ళు కావడం విశేషం. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది.

ఇద్దరికి రెండవ పెళ్లే

ఇద్దరికి రెండవ పెళ్లే

రాధికకు అంతకు ముందే వివాహం జరిగింది. 2002 లో రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రాధిక కొద్దిరోజులకే అతడి నుంచి విడిపోయింది. కుమారస్వామికి 1986 లోనే వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య అనిత. కొన్ని రోజుల తరువాత కుమారస్వామి, అనిత విడిపోయారు.

నిర్మాతగా

నిర్మాతగా

రాధిక ఇప్పటికి కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ పోషిస్తున్నారు. నిర్మాతగా కూడా ఆమె కొన్ని చిత్రాలు నిర్మించడం విశేషం. అందం, అభినయం కలబోసిన నటి కావడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X