నేడే శ్రీచైతన్యలో సుకుమార్ బ్యాచ్ రచ్చ
హైదరాబాద్: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'కుమారి 21ఎఫ్' చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం నిర్వహించనున్నట్లు సమర్పకుడు సుకుమార్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
#Kumari21F Platinum Disc FunctionStay tuned for more updates!
Posted by Sukumar B on 16 November 2015
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన చిత్ర టీజర్‌కి మంచి స్పందన లభించింది.
అలాగే ఆడియో విడుదల కార్యక్రమం స్త్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా జరిగింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 20న 'కుమారి 21ఎఫ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
చిత్రం విశేషాలకు వెళ్తే..
కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.
దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.


Click it and Unblock the Notifications












