»   » "కుమారి 21 ఎఫ్" తరహా చిత్రం "కుమారి మల్లిక"

"కుమారి 21 ఎఫ్" తరహా చిత్రం "కుమారి మల్లిక"

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన "కుమారి 21 ఎఫ్" తరహాలో.. ఆస్కార్ కృష్ణ దర్సకత్వంలో రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న కన్నడ చిత్రం "మిస్ మల్లిక". రూపా నటరాజన్, రంజన్ శెట్టి, శ్వేత, విక్రమ్ నటించిన ఈ చిత్రం తెలుగులో "కుమారి మల్లిక" పేరుతో విడుదలవుతోంది.

Kumari Mallika Releasing on 12 Feb

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై డి.పూర్ణకళ-తపస్య కృష్ణ సమర్పణలో బెజవాడ రమణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. వంశీకిరణ్ రెడ్డి-స్వర్ణ శ్రీనివాస్ నిర్మాణ సారధులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలవుతోంది.

Kumari Mallika Releasing on 12 Feb

ఈ సందర్భంగా నిర్మాత బెజవాడ రమణ మాట్లాడుతూ.. "సైబర్ క్రైమ్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం కన్నడలో సంచలన విజయం సాధించింది. బెంగళూర్ లో 365 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు!!

English summary
Roopa Natarajan, Ranjan Shetty starrer Kumari Mallika movie releasing on 12 Feb.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu