కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా దర్శకుడు అరెస్ట్.. లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్
ఎప్పుడు ఎవరు ఎలా ఫేమ్ లోకి వస్తారో అనేది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కొందరికి వద్దనుకున్నా కూడా అదృష్టం వరిస్తుంది. ఇలా ఈ మధ్య కాలంలో అసలు సినిమాలకి సంబంధమే లేకుండా ఓ రేంజ్ లో ఫేమ్ తెచ్చుకున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది మోనాలిసా భోస్లే అని చెప్పాలి.
కాగా ఎక్కడో మధ్య ప్రదేశ్ కి చెందిన ఈ చిన్నపాటి 16 ఏళ్ల యువతి మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి ఇండియా వైడ్ గా ఒక్కసారిగా సంచలనం అవుతాను అని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. కాగా ఆ మహాకుంభమేళా పుణ్యమా అని ఆమె నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవ్వడంతో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా తనకి అవకాశాలు వచ్చేందుకు ఎంతో సమయం పట్టలేదు.

కాగా ఈ వెంటనే ఆమెకి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చేయడం ఆఫ్ లైన్ లో పలు ఫంక్షన్స్ కానీ ఏవైనా మీటింగ్ లకి గాని ఆమెని ప్రత్యేక అతిధిగా పిలవడం అనేది ఒకింత షాకింగ్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే ఆమెకి బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెని కలిసి ఆమెకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం చక చకా జరిగిపోయింది. కాగా ఇపుడు ఇదే దర్శకుడు విషయంలో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
కాగా ఢిల్లీలో ఈ దర్శకుడు సనోజ్ పై కేసు నమోదు చేయడమే కాకుండా అతన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఇతన్ని పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయడం ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. అయితే అతను లైంగిక వేధింపులు చేసింది మోనాలిసా విషయంలో కాదట. ఆమె కంటే ముందు మరో యువతికి సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెని లైంగికంగా వేధింపులకి గురి చేసాడని చెబుతుంది.
ఇంతేనా ఈ దర్శకుడు చేసిన రాసలీలలు చాలానే ఉన్నాయట. టిక్ టాక్ లో ఫేమ్ తెచ్చుకున్న ఆ యువతిని సంప్రదించి కాల్ చేసి వేధించేవాడు అని ఒకోసారి బెదిరింపులు కూడా చేసాడని ఆమె చెబుతుంది. అంతే కాకుండా ఓ రోజు చనిపోతాను అని బెదిరిస్తే అతన్ని కలిసేందుకు వెళ్లగా ఆమెని రిసార్ట్ కి మాట్లాడాలని తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి ఆమెపై అసభ్య వీడియోలు కూడా చిత్రీకరించారు అని ఆమె కంప్లైంట్ లో రివీల్ చేసిందట.
దీనితో ఈ దర్శకుని విషయంలో ఈ వార్త బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. అలాగే కొంచెం ఉంటే ఈ అమాయక యువతి మోనాలిసా పరిస్థితి కూడా ఇలానే అయ్యి ఉండేది ఏమో అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సనోజ్ పై విచారణ కొనసాగుతుందట. మరి ఈ ఇష్యూ తర్వాత మోనాలిసా ఈ దర్శకునితో వచ్చిన సినిమా చేస్తుందో లేక తప్పుకుంటుందో అనేది కూడా మరింత ఆసక్తిగా మారింది. అలాగే ఈ కేసులో అంతిమంగా ఏమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











