Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాఘవేంద్రరావు,రాజమౌళి షేర్ చేసారు
హైదరాబాద్: ఛాందిని చౌదరి, సుధాకర్ కొంకుల, సుధీర్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుందనపు బొమ్మ'. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు.
కుందనపు బొమ్మ... చైత్ర మాస పాట ...
Posted by K Raghavendra Rao on 19 January 2016
అదేవిధంగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘కుందనపు బొమ్మ' చిత్ర దర్శకుడు వర ముళ్లపూడి తన స్నేహితుడని పేర్కొంటూ అభినందనలు తెలిపారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
My friend Vara's upcoming movie Kundanapu Bomma is releasing this February... Wishing him all the success!
Posted by SS Rajamouli on 19 January 2016
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో ఎస్.ఎల్. ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుందనపు బొమ్మ'. జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''అచ్చమైన తెలుగు టైటిల్ ఇది. ఈ సినిమాలో విశ్వనాథ్ గారి సినిమాలోని డ్రామా, నా సినిమాలోలా పాటలు, రాజమౌళి సినిమా తరహా ఎమోషన్స్ ఉంటుందని భావిస్తున్నాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ''రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినప్పటి నుంచి ముళ్ళపూడి వరా నాకు పరిచయం. ఓ ట్రైన్ జర్నీలో ఇద్దరం చాలా మంచి స్నేహితులమయ్యాం. ఆయనకు ఇప్పటి వరకు రావాల్సిన పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమాతో ఆ హిట్ సాధిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

ముళ్ళపూడి వరా మాట్లాడుతూ ''నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కీరవాణి , వళ్ళి, రాజమౌళి అండగా నిలిచారు. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం వారే. ఇక ఈ సినిమా విషయానికొస్తే సంవత్సర కాలంగా ఈ సినిమా నిర్మాణం కోసం చాలా కష్టపడుతున్నాం. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ మంచి కథ కోసం వెయిట్ చేశారు'' అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ- ఓ గొప్ప సంస్థతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతమ్ కశ్యప్, పాటలు: ఆరుద్ర, శివశక్తిదత్త, అనంత్ శ్రీరామ్, కెమెరా: ఎస్.డి.జాన్, నిర్మాతలు: జి.అనీల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ,దర్శకత్వం: ముళ్ళపూడి వర.