సినిమా రేంజ్‌లో కుర్చిమడతపెట్టి తాత లవ్ స్టోరీ.. భార్య కోసం షాకింగ్ డెసీషన్.. ఇది కదా ప్రేమంటే!
ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్న పేర్లలో కుర్చి మడత పెట్టి తాత పేరు ఒకటి. ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియా మొత్తం రచ్చ చేసిన ఈయన గురంచి తెలుసుకునేందుకు చాలా మంది తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన ఈ డైలాగ్ తోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమాలో పాట ఉండడంతో మరింత ట్రెండ్ అయ్యాడీ తాత. ఈక్రమంలోనే చాలా మంది ఈయనను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అద్భుతమైన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ కుర్చి మడత పెట్టి తాత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా ఒక్క డైలాగ్ తో ఇంత పాపులర్ కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తనకు ఎవరైనా సినిమా అవకాశం ఇస్తే కచ్చితంగా డ్యాన్స్ చేస్తానని.. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా పాటలు కూడా పాడతానని వివరించాడు. లైవ్ లోనే ఓ పాట కూడా పాడి వినిపించాడు. అలాగే కుర్చి మడత పెట్టి పాట కోసం థమన్ తనకు 5 వేల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది అన్నారు.

అలాగే తనను త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కలిశారని చాలా హ్యాపీగా అనిపించిందని వివరించారు. అయితే ఆయన ఈ డైలాగ్ కొట్టడం వెనుక ఉన్న స్టోరీ అంతా ఉత్తదే అని ఆయన భార్య చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్య్వూలో పాల్గొన్న కుర్చి మడత పెట్టి తాత భార్య మరిన్ని ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. తాత ఎప్పుడూ చెప్పే విధంగానే మీది లవ్ మ్యారేజీయేనా అని అడగ్గా.. ఆయన భార్య అవును అని సమాధానం చెప్పింది. తామిద్దరి ప్రేమ పెళ్లియే అని స్పష్టం చేసింది. అలాగే తమ లవ్ స్టోరీ గురించి కూడా రివీల్ చేసింది.
తనకోసం కుర్చి మడత పెట్టి తాతా రోజూ వాళ్ల ఊరికి వెళ్లి గుడి ముందు కూర్చునే వాడట. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే పడిగాపులు కాసేవాడట. రోజూ తనను తదేకంగా చూస్తూ ఉండేవాడట. ఓరోజు వచ్చి నేరుగా మాట్లడగా.. తాను భయపడి పారిపోయిందట. కానీ ఆ తర్వాత కూడా అతను అలాగే చేయడంతో ఓరోజు ధైర్యంగా వెళ్లి మాట్లాడిందట. అప్పుడే కుర్చి మడతపెట్టి తాత నేను నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటానని తన మనసులోని మాటలను ఆమెకు వివరించాడట.

అయితే కుర్చిమడత పెట్టి తాతలోని సిన్సియారిటీ నచ్చిన ఆమె అదే విషయాన్ని తన తల్లికి చెప్పిందట. కానీ లారీ డ్రైవర్లకు తన కూతుర్నుఇవ్వనని తల్లి అనడంతో.. వెంటనే కుర్చిమడత పెట్టి తాత వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని వెల్లడించిందట. దీంతో కచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని.. ఆమెను తీసుకెళ్లి స్నేహితురాలి ఇంట్లో దాచి పెట్టాడట. ఆ తర్వాత ఆయనే నేరుగా వెళ్లి ఆ అమ్మాయి ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడట. అలాగే ఇప్పుడు తన భార్య కోసం తాను తాగుడు కూడా మానేస్తున్నట్లు చెప్పి ఆమెను సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తూ భార్యను చక్కగా చూసుకుంటున్న కుర్చి మడతపెట్టి తాత ప్రేమికులకు ఓ ఇన్సిపిరేషన్.


Click it and Unblock the Notifications











