'కథానాయకుడు' క్రియేటర్ పై బ్యాన్!!

By Staff

Srinivasan
కథానాయకుడు సినిమా కథా పరియంబోల్ అనే మళయాళ చిత్రం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కథకుడు,దర్శకుడు,నటుడు,నిర్మాత అయిన శ్రీనివాసన్ పై కేరళ నిర్మాతల మండలి బ్యాన్ పెట్టింది. కారణంగా ఆయన పై వింధ్యన్ అనే సీనియర్ నిర్మాత చేసిన కంప్లైయింట్ ని చూపుతున్నారు. దాని ప్రకారం శ్రీనివాసన్ తో సినిమా చేయటం కోసం ఆ నిర్మాత 1988 లో ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారుట. అయితే అప్పటినుంచీ ఇప్పటి వరకూ అది కార్యరూపం దాల్చలేదుట. దాంతో ఆ నిర్మాత సినిమా అన్నా పూర్తి చేయాలి ...లేదా అప్టటినుంచీ వడ్డీ లేక్కించి చెల్లించాలని కోరారు.

దీనిని అక్కడి నిర్మాతల మండిలి పూర్తిగా సమర్ధించింది. ఈ విషయమై నిర్మాత ...మీడియాతో మాట్లాడుతూ..శ్రీనివాసన్ నాకు మంచి మిత్రుడు..కానీ నేనిప్పుడు ఉన్న స్ధితిలో అంతకు మించి ఏమీ చేయలేక పోయాను. పదేళ్ళ నా సహనం ఇన్నాళ్ళకు బ్రద్ధలయింది అంటూ ఆవేదన వెళ్ళబుచ్చాడు. దాంతో ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందనుని ఉత్సాహపడ్డవారు నిరాశపడ్డారు. దీనిపై శ్రీనివాసన్ వ్యాఖ్యానించటానికి ఇష్టపడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X