సౌత్ లో ఒక వెలుగు వెలిగి చివరకు గుడి కూడా కట్టించుకున్న ఖుష్భూ ఇప్పుడు దెయ్యం అమ్మమ్మగా ఓ సినిమాలో కనిపించనుంది. కెరీర్ ప్రారంభంలో ముంబయి పబ్ లో బార్ డాన్సర్ గా చేసిన ఆమె తర్వాత తమిళ సినిమాల్లో ప్రవేశించి ఎనలేని అభిమానులను సంపాదించుకుంది. అనంతరం తెలుగులో పలు చిత్రాల్లో చేసింది. తర్వాత సి.సుందర్ ని పెళ్ళి చేసుకుని సెటిల్ అయింది. స్టాలిన్ వంటి చిత్రాల్లో అక్క పాత్రలు చేసిన ఖష్బూ ఇప్పుడు నానమ్మ,అమ్మమ్మ పాత్ర అయినా ఫరవాలేదంటోంది. దాంతో Thanthirap Paatti అనే చిత్రంలో దెయ్యం అమ్మమ్మగా సెలక్టయింది. సంతోషంగా ఒప్పుకున్నా ఎందుకంటే నా పిల్లలు కూడా దీన్ని చూసి ఎంజాయి చేస్తారు కదా అంటోంది.