చిరంజీవి స్టాలిన్‌లో చెల్లెలుగా ఖుష్బూ
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పెళ్ళికి ముందు సెక్స్ అనుభవం తప్పు కాదని ప్రకటించి సంచలనం సృష్టించిన సినీనటి ఖుష్బూ చిరంజీవి తదుపరి చిత్రం స్టాలిన్‌లో చిరు చెల్లెలుగా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్న విషయం దాదాపు ఖరారయింది. తమిళ సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ అయిన త్రిష మార్చి మెదటి వారంలో షూటింగ్‌లో పాల్గొంటుంది. అందరివాడు జై చిరంజీవ వంటి సినిమాల్లో తన ఇమేజికి సరిపడని పాత్రలు వేసి ప్రేక్షకులను నిరాశ పరిచిన చిరంజీవి స్టాలిన్ స్క్రిప్టు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక చోట్ల స్క్రిప్టులో మార్పులు చేర్పులు జరిగాయి.


Click it and Unblock the Notifications