పవన్ కళ్యాణ్ ఖుషీ ఖుషీగా ఉండడం కోసం న్యూజిలాండ్ కివెళుతున్నారా...!
పవన్ కళ్యాణ్, త్రిష లు హీరో హీరోయిన్ గా ప్రముఖ నిర్మాత గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో అత్యంత భారీగా రూపొందుతున్న చిత్రం ఖుషీ ఖుషీగా. ఇటీవల కాలంలో కాశీ లో అత్యంత భారీషేడ్యూల్ ని పూర్తి చేసుకోని హైదరాబాద్ రావడం జరిగింది. టాలీవుడ్ లో ఎన్నో సిల్వర్ జూబ్లీ హిట్స్ ని అందించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరోవిశేషం.
ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ 'ఇటివలే పవన్ కళ్యాణ్ నటిస్తున్నఖుషీ ఖుషీగా చిత్రం షూటింగ్ ని కాశీ లో అత్యంత భారీగా రూపొందించడం జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా ఎక్కడా ఆటంకం లేకుండా జరగటానికి ముఖ్య కారకులు హీరో పవన్ కళ్యాణ్. షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇస్తున్న కోపరేషన్ కిప్రత్యేక మైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. దర్శకుడు జయంత్ సి పరాన్జీ తన పాత చిత్రాలను మించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. జయంత్ సి పరాన్జీ గతంలో ప్రేమంటే ఇదేరా, టక్కరి దోంగ, లక్షీనరసింహా, శంకర్ దాదా యమ్ బిబియస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇక ఈచిత్రానికి స్క్రిప్ట్ మరియు మాటలను క్రియేటివ్ రైటర్ అండ్ డైనమిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇలా అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రం లో వుంటాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించిన చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్నమైన గెటప్స్ లోకనిపించనున్నారు. ఇటీవల విడుదలైన కోమరం పులి ప్లాప్ కావడంతో ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ చాలా కసిగా ఫ్యాన్స్ కుమంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం తదుపరి షేడ్యూల్ ని నవంబర్ రెండవ వారంలో న్యూజిలాండ్ లో 40 రోజుల పాటు గ్యాప్ లేకుండా చేయడం జరుగుతుంది. ఈసినిమాలో ఇద్దరు హిరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ అందించిన ఆడియో ఈ చిత్రానికి ప్రధాన హై లైట్ గా నిలుస్తాయి అని అన్నారు.


Click it and Unblock the Notifications











