Kushi twitter Review విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా? ట్విట్టర్‌లో నెటిజన్ల రివ్యూలు ఎలా ఉన్నాయంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలో భారత కాలమానం ప్రకారం 12.30 గంటలకు మొదలయ్యాయి.

సమంత రుత్ ప్రభు హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు క్రేజీగా బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ట్విట్టర్‌లో సినీ తారలు, నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Kushi Telugu movie twitter Review: Is vijay Deverakonda hits the bulls eye? Audience reaction is here..

ఏడాది కాలంగా మీకు దూరంగా: ఖుషి సినిమాకు మందు నా ఆలోచనలు మీతో పంచుకోవాలని అనుకొంటున్నాను. ఈ సినిమా మీ ముందుకు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. గత ఏడాది కాలం నుంచి బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. అప్పడే ఏడాది తిరిగిపోయిందానే ఫీలింగ్ కలిగిన సమయంలో ఈ సినిమా మీ ముందుకు వస్తున్నది. సినిమా చూసినంత సేపు గ్రేట్ ఫన్ మీతో ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. మీ ముఖంలో చిరునవ్వులను చూసేందుకు ఎంతగా ఎదురు చూస్తున్నానో మాటల్లో చెప్పలేను అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

చల్లని పిల్లగాలిలా ఖుషి: ఖుషి మూవీ చల్లని పిల్లగాలి లాంటి లవ్ స్టోరి. సినిమా చూసే ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వులు పూయించే చిత్రం. విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు, చిత్ర యూనిట్‌ మొత్తానికి బ్లాక్‌బస్టర్ విజయం దక్కాలని, సినిమా చరిత్రలో భారీ విజయం చేకూరాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం అని మహేష్ బాబు ట్రెండ్స్ ట్వీట్ చేసింది.

సాయిధరమ్ తేజ్ ఏమన్నాడంటే?: ప్రేమ, ప్రేమికుల అంచనాల చుట్టూ తిరిగే బ్యూటిపుల్ లవ్ స్టోరి ఖుషి. సమంత మనోబలానికి మరింత ప్రేమ దక్కుతుంది. మీ ప్రేమను కోరుకొనే ఫ్యాన్ బాయ్‌గా సినిమా విజయం సాధించాలని కోరుకొంటున్నాను. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ, హేషమ్ అబ్దుల్ వహబ్, మైత్రీ మూవీ మేకర్స్‌కు బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అని నమ్ముతున్నాను అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

ఖుషీ మూవీ వినోదంగా సాగే క్లీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. రెగ్యులర్ స్టోరి,కొంత నిడివి సాగదీసినట్టు ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ కంటెంట్ వర్కవుట్ అయింది. చివరి 30 నిమిషాలు సినిమా బాగుంది. అక్కడక్కడ కథ ఊగిసలాడినట్టు అనిపిస్తుంది. కానీ థియేటర్‌లో చూడటానికి బాగుంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అర్జున్ రెడ్డి, గీతా గోవింద స్థాపించిన రికార్డులు బ్రేక్ అవుతాయి. సినిమా బాగుందనే టాక్ వచ్చిందంటే.. ఇంకా ఎక్కడికో వెళ్తుంది. విజయ్ దేవరకొండకు, సమంతకు కంగ్రాట్స్. శివ నిర్వాణకు హిట్ పడింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హిట్టు కోసం విజయ్ దేవరకొండ చూసిన ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఐదేళ్ల తర్వాత భారీ హిట్టుకొట్టాడు. బ్లాక్‌బస్టర్ సినిమాకు ఏ మాత్రం తగ్గని సినిమా ఖుషి. ఖుషితో మరోసారి సెన్సేషనల్ ఫెర్ఫార్మెన్స్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటి. ఈ సినిమా ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే అని ఓ నెటిజన్ కామెంట్ చెట్టాడు.

విద్వేషాన్ని ఎదుర్కొన్నాడు. అవసరం లేని నెగిటివిటిని చవిచూశాడు. ప్రతీ సినిమాకు 200 శాతం ఎఫర్ట్ పెట్టాడు. 5 ఏళ్ల తర్వాత స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ది కింగ్ ఈజ్ బ్యాక్. ది విజయ్ దేవరకొండ అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

దేవుడంటే నమ్మకం లేని నాస్తిక తండ్రి, ఓ బ్రాహ్మణ తండ్రికి మధ్య జరిగే కథ ఖుషి. శివ నిర్వాణ రైటింగ్ టెర్రిఫిక్‌గా ఉంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు అద్బుతంగా ఉంది. హిట్టు కొట్టావు హీరో విజయ్ దేవరకొండ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఖుషి మూవీ యావరేజ్. టక్ జగదీస్ కంటే బెటర్ సినిమా. హృదయాన్ని తేలికపరిచే సినిమా. శివ నిర్వాణ ఇచ్చే ఎమోషనల్ టచ్ మిస్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఖుషి మూవీ సెకండాఫ్ ఎక్సలెంట్. చివరి 30 నిమిషాలు సీన్లు ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా కేక పెట్టించేలా ఉన్నాయి. సాంగ్స్, విజయ్ దేవరకొండ యాక్షన్. సమంత ఫెర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చివరి 30 నిమిషాలు హైలెట్. బైక్ సీన్ బాగలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హిట్టు కొట్టేశాం అన్న. . ఐదేళ్ల తర్వాత ఖాతాలో హిట్టు పడింది. ప్రామిస్ చేసినట్టే విజయ్ దేవరకొండ అన్న మంచి సినిమా ఇచ్చాడు. ఐదేళ్ల తర్వాత ఖుషితో హిట్టు కొట్టాడు. మైత్రీ మూవీస్, శివ నిర్వాణ, సమంత రుత్ ప్రభు, విజ్ దేవరకొండకు కమ్ బ్యాక్ మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా సెకండాఫ్ ఉంది. ఆడియెన్స్‌కు సెకండాఫ్ క్లిక్ అయితే ఖుషి సేఫ్ సినిమా అవుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X