RRR: ఎన్టీఆర్, చరణ్ కాంబోలో మరో మూవీ.. రాజమౌళి తండ్రి కామెంట్లతో మేటర్ లీక్

'బాహుబలి' మూవీతో ప్రపంచం మొత్తాన్ని టాలీవుడ్‌ వైపు చూసేలా చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అంతేకాదు, ఈ చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను సగర్వంగా చాటి చెప్పాడు. అప్పటి నుంచే తెలుగు సినిమాకు ఎక్కువ గుర్తింపు దక్కుతోంది. ఇక, అంతటి భారీ విజయం తర్వాత దర్శకధీరుడు తెరకెక్కిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం).

బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగింది. అందుకు అనుగుణంగానే దీనికి రెస్పాన్స్, కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆ సంగతులు మీకోసం!

స్టార్ హీరోలతో జక్కన్న మ్యాజిక్

స్టార్ హీరోలతో జక్కన్న మ్యాజిక్

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను చేశారు.

వీక్ డేస్‌ కూడా హవా చూపించి

వీక్ డేస్‌ కూడా హవా చూపించి

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. వీక్ డేస్‌లో దీని ప్రభావం తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా వారాల్లోనూ హవాను చూపించింది.

వారం రోజుల్లో 710 కోట్లతో రచ్చ

వారం రోజుల్లో 710 కోట్లతో రచ్చ

ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకుని RRR (రౌద్రం రణం రుధిరం) గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 392.45 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 710 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది.

రికార్డులు బ్రేక్ చేస్తోన్న సినిమా

రికార్డులు బ్రేక్ చేస్తోన్న సినిమా

మెగా, నందమూరి ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆరంభం నుంచే భారీ రెస్పాన్స్ వస్తోంది. అందుకే అటు ఓవర్సీస్ నుంచి ఇటు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా చాలా పట్టణాల్లో ఆల్‌టైం రికార్డులు నమోదు అయ్యాయి.

RRR సీక్వెల్ అంటూ కొత్త చర్చ

RRR సీక్వెల్ అంటూ కొత్త చర్చ

భారీతనంతో వచ్చిన ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనను అందుకుంటోంది RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ. ఇందులో ఎన్టీఆర్, చరణ్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడంతో రెండు కుటుంబాల అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే సమయంలో ఈ చిత్రానికి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.

 సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్

సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ సీక్వెల్ గురించి చాలా రకాల చర్చలు జరుగుతుండడంతో.. దీనికి రచయితగా చేసిన విజయేంద్ర ప్రసాద్ (రాజమౌళి తండ్రి) తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘RRR సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి. దీనికోసం కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి. ఆ దిశగా చర్చలు జరిగిన విషయం నిజమే' అని వెల్లడించారు.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
 ఎన్టీఆర్‌కు నచ్చింది అని చెప్పి

ఎన్టీఆర్‌కు నచ్చింది అని చెప్పి

ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇటీవలే తారక్ మా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సీక్వెల్ గురించి మాట్లాడుతూ నాలుగైదు పాయింట్లను చెప్పాను. ఇవన్నీ అతడికి బాగా నచ్చాయని అన్నాడు. అన్ని కుదిరితే RRR (రౌద్రం రణం రుధిరం) సీక్వెల్ రూపొందే అవకాశం కూడా ఉంది' అని చెప్పారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X