#BoycottRRRinKarnataka దెబ్బకు దిగొచ్చిన మేకర్స్.. కన్నడిగులకు స్పెషల్ నోట్.. మద్దతు ఇమ్మంటూ!
బాహుబలి సినిమాను తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తి చేసిన రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే అనేక మార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా చిట్ట చివరకు మార్చి 25వ తేదీన రిలీజ్‌కు రెడీ అయింది. అయితే కర్ణాటకలో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నామని కన్నడిగులు రచ్చ చేస్తున్నారు. శివరాజ్ కుమార్ సహా కన్నడ ప్రజలను అవమానించారని సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడంతో ఎట్టకేలకు RRR టీమ్ దిగివచ్చింది. ఆ వివరాలు ఏమిటంటే?
Recommended Video


శివరాజ్ కుమార్ రిక్వెస్ట్ చేసినా
RRR సినిమా ప్రమోషన్‌లో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు, చిక్ బల్లాపూర్ లాంటి ప్రదేశాల్లో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ పర్యటించారు. భారీ వేడుకలు నిర్వహించారు. చిక్ బల్లాపూర్ లో జరిగిన ఈ వేడుకలో కర్ణాటక సీఎం, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తదితరులు పాల్గొనగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. రాజమౌళికి కన్నడవాసులందరి తరపున చెబుతున్నానని RRR సినిమాను కన్నడ భాషలో రిలీజ్ చేస్తే సంతోషంగా ఉంటుంది అని శివరాజ్ కుమార్ కోరారు.

బాయ్ కాట్ అంటూ .
అయితే మార్చి 25న రిలీజ్ అవుతున్న RRR సినిమాను కన్నడ భాషలో కాకుండా కర్ణాటక వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో తెలుగులో రిలీజ్ చేయడంపై కన్నడ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉండడమే కాక పెద్ద ఎత్తున ట్విట్టర్ లో టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమాని కన్నడ భాషలో రిలీజ్ చేస్తే తప్ప ఈ సినిమాను చూడం అంటూ RRR సినిమాను బాయ్‌కాట్ చేయండి అంటూ #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు.

స్వంత వాయిస్‌లో డబ్
ఈ విషయం నేషనల్ వైడ్ ట్రేండింగ్ అవడంతో ఎట్టకేలకు ఈ సినిమాని కర్ణాటకలో విడుదల చేయనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఒక స్పెషల్ నోట్ విడుదల చేసింది. ప్రియమైన ప్రేక్షకులారా మీకు తెలిసినట్లుగా, RRR మార్చి 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. RRR సినిమాలో ప్రధాన హీరోలు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కన్నడ నేర్చుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మొదటి సారి వారి స్వంత వాయిస్‌లో డబ్ చేసారు.

అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము
అయితే మీరు కన్నడ భాషలో మాగ్నమ్ ఓపస్‌ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారని మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల, RRR యొక్క కన్నడ వెర్షన్‌ను ప్లే చేయడానికి అందరు థియేటర్ యజమానులను ఒప్పించే పనిలో ఉన్నారు. కన్నడ వెర్షన్‌ను రేపటి నాటికి అన్ని స్క్రీన్‌లలోకి తీసుకురావడానికి మేము మా చేతిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.

మద్దతు ఇస్తారని
మీరు కన్నడ వెర్షన్‌ను చూడటం ద్వారా మాకు మద్దతు ఇస్తారని, మరిన్ని స్క్రీన్‌లను యాడ్ చేయడంలో కూడా మాకు సహాయపడతారని మేము ఆశిస్తున్నాము అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న RRR బృందం ఇవాళ హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అయ్యారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు.


Click it and Unblock the Notifications











