L2 Empuraan : ఎంపురాన్ కాంట్రవర్సీ.. ఆ 17 సీన్లు కట్.. ఎందుకు? ఏమైంది?
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'లూసీఫర్' 2019లో విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. మలయాళం స్టార్ హీరో, 'సలార్' స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అప్పుడు ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్ ను కూడా ప్రకటించి రీసెంట్ గా థియేటర్లలోకి కూడా తీసుకొచ్చారు. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించడంతో పాటు ఈసారి కీలక పాత్రలో నటించారు కూడా.
ఇక మార్చి 27న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వెర్షన్ లలోనూ రిలీజ్ అయ్యింది. తొలిరోజు సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషనల్ వసూళ్లను అందుకున్నారు మేకర్స్. కేవలం రెండు 48 గంటల్లోనే ఈ చిత్రం రూ.102 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. హయ్యేస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మలయాళం చిత్రాల్లో ఇండస్ట్రీలోనే మొదటి చిత్రంగా రికార్డుగా క్రియేట్ చేసింది.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఈ చిత్రం ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకుంది. హిందూత్వాన్ని వ్యతిరేకించే విధంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పలవురు మేకర్స్ పై మండిపడ్డారు. గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకొని ఆర్ఆర్ఆర్, బీజేపీలను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని సినిమాపై అభ్యంతరాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలోనూ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ 17 మార్పులు చేయాలని మేకర్స్ ను ఆదేశించింది.
దీంతో యూనిట్ సినిమాను రీ ఎడిట్ చేస్తున్నారు. సెన్సార్స్ బోర్డు ఆదేశించిన 17 కట్స్ పూర్తైన తర్వాత మళ్లీ సెన్సార్ బోర్డు అనుమతికి దరఖాస్తు పెట్టుకోబోతున్నారు. ఇక అప్పటి వరకు సినిమా థియేటర్లలో ఆడదని తెలుస్తోంది. మళ్లీ బుధవారం లేదా గురువారం చిత్రాన్ని తిరిగి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ కాంట్రవర్సీపైనా మోహన్ లాల్ కూడా స్పందించారు. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ద్వారా పలు వర్గాల వారు వ్యతిరేక నినదాలు చేయడంతో స్పందించి క్షమాపణలు చెప్పారు. తమ సినిమా ఎలాంటి రాజకీయ, సామాజిక అంశాలకు విరుద్ధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, అలా జరగకపోవడంతో బాధపడుతున్నానని చెప్పారు. అందుకు క్షమాపణలు చెబుతున్నానని బహిరంగ ప్రకటన చేశారు.
మరోవైపు ఎంపురాన్ చిత్రంలో టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూ.150 కోట్లతో నిర్మించారు. చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











