Laal Singh Chaddha: చిరంజీవి మాటలకు ఏడ్చేసిన అమీర్ ఖాన్.. ఎమోషనల్ మూమెంట్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక విభిన్నమైన కంటెంట్ ఉంటుంది. ఇక నటనతో జనాలను ఎంతగానో కదిలిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ఆయన టాలీవుడ్ అగ్ర ప్రముఖులను కూడా ఆకట్టుకున్నాడు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షోను టాలీవుడ్ అగ్ర నటీనటులకు ప్రత్యేకంగా చూపించడం జరిగింది. అయితే షో చూసినా తరువాత చిరంజీవి మాటలకు కూడా అమీర్ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

పాజిటివ్ రియాక్షన్
అమీర్ ఖాన్ ఎంతో ఇష్టంగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 22 న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఆ సినిమాని ఇదివరకే బాలీవుడ్ కొంతమంది సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రివ్యూ చూపించిన పాజిటివ్ రియాక్షన్ అందుకున్నాడు. అంతే కాకుండా ఇతర సినీ ప్రముఖులు కూడా ఆయన సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో వహుడాలని అనుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్స్ కోసం
అమీర్ ఖాన్ ఇటీవల టాలీవుడ్ సినీ ప్రముఖులు కు కూడా స్పెషల్ షో వేశారు. ఆ స్పెషల్ షో చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అలాగే పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా వచ్చారు. వారు సినిమా చూసిన అనంతరం కొంతసేపు మాట్లాడుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మెగాస్టార్ ప్రశంసలు
అయితే సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అమీర్ ఖాన్ నటనపై ప్రశంసలు అందించారు. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించినట్లు చెప్పారు. ప్రతీ ఫ్రేమ్ లో కూడా అమీర్ తన పాత్రకు చాలా న్యాయం చేసినట్లు చెప్పారు. అలాగే నాగచైతన్య కూడా స్పెషల్ పాత్రలో కనిపించగా అతను కూడా ఎంతగానో ఇంప్రెస్ చెప్పినట్లు వివరణ ఇచ్చారు.

అమీర్ ఖాన్ ఎమోషనల్
అయితే అమీర్ ఖాన్ గురించి చెప్పే సమయంలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. సినిమాలో పాత్రకు తగ్గట్టుగా మీరు చూపించిన హవా భావాలు అద్భుతంగా ఉన్నాయని మెగాస్టార్ ఇచ్చిన వివరణకు అమీర్ ఖాన్ ఆ మాటలను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు. తన కళ్ళజోడు తీసుకుంటూ కన్నీళ్లను కూడా తుడుచుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

తెలుగులో కూడా
అసలైతే ఈ సినిమాను మొదట కేవలం హిందీలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి ఇది ఒక భాషకు చెందిన సినిమా కాదు అని ప్రతి ఒక్కరు కూడా చూడాలి అని పాజిటివ్గా స్పందించి తెలుగులో కూడా విడుదల చేసేందుకు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

నాగచైతన్య పై కూడా పాజిటివ్ కామెంట్స్
ఇక లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య కూడా ఒక మంచి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా సినీ ప్రముఖులను ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది ఇక దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత హార్ట్ ఫుల్ గా అనిపించింది అని అమీర్ ఖాన్ పై కూడా ఎంతగానో పాజిటివ్గా స్పందించారు. ఇక రాజమౌళి కూడా అదే తరహాలో ప్రత్యేకంగా అభినందించి చిరంజీవి చేతుల మీదుగా శాలువా కప్పించారు.


Click it and Unblock the Notifications











