twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తున్న అల్లరి నరేష్ లుక్(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ ఫోటోలో భారీ కాయంతో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.... తనదైన హాస్యంతో మనల్ని నవ్వుల జల్లుల్లో ముంచెత్తే ఆ హీరో ఇప్పుడు సరికొత్త అవతారంతో పలకరించబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అల్లరి నరేశ్‌.నరేశ్‌, రవిబాబు కాంబినేషన్లో 'లడ్డూబాబు' పేరుతో వస్తున్న ఈ చిత్రంలో హీరో భారీకాయుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో నరేశ్‌ మేకప్‌ కోసమే భారీగా వ్యయం చేశారని సమాచారం. చాలా కాలం తర్వాత భూమిక ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనుంది.

    Laddu Babu First Look Poster

    ఇక్కడున్నది అల్లరి నరేష్‌ అని ఇప్పటికీ మీరు నమ్మడం లేదు కదా? కానీ ఇది నిజం. దర్శకుడు రవిబాబు మాయాజాలమే ఇదంతా. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేష్‌ కథానాయకుడిగా 'లడ్డూబాబు' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నరేష్‌ ఇలా బొద్త్దెన అవతారంలో కనిపించబోతున్నారు. ఈ రూపం కోసం హాలీవుడ్‌కి చెందిన మేకప్‌ నిపుణులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నరేష్‌ సరసన భూమిక నటిస్తోంది. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత.

    ఈ చిత్రానికి చక్రి స్వరాలు అందిస్తున్నారు. రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

    English summary
    Allari Naresh is going to be seen in a radical new avatar. He has teamed up with director Ravi Babu for a new film titled ‘Laddu Boy’ and Naresh will be seen as a very fat guy in this movie. For this film, he is undergoing a special transformation and a London based prosthetic makeup technician is helping Allari Naresh. The tall and lanky actor visited the UK recently for the prosthetic makeup test.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X