అల్లరి నరేష్ 'లడ్డూబాబు' ఆడియో తేదీ ఖరారు

రవిబాబు సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. తొలి చిత్రం 'అల్లరి'లో వినోదాన్ని వినూత్నంగా ఆవిష్కరించి, ఓ ట్రెండ్ సృష్టించారు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, తాజా చిత్రం 'లడ్డూబాబు' మరో ఎత్తు అనే చెప్పాలి. 'అల్లరి' చిత్రంలో బక్కపలచని నరేష్ ని చూపించిన రవిబాబు 'లడ్డూబాబు'లో భారీకాయుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం విదేశీ నిపుణులు నరేష్ కి మేకప్ వేశారు. మేకప్ చేయడానికి కొన్ని గంటలు పట్టడం మాత్రమే కాదు.. తీయడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది.
ఆహార్యం, అభినయం పరంగా నరేష్ కిది సవాల్ లాంటి పాత్ర. ఈ పాత్రను అద్భుతంగా చేశారు. లడ్డూబాబుగా నరేష్ ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత రవిబాబు, నరేష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడం, నరేష్ లుక్ వినూత్నంగా ఉండటం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే మంచి చిత్రం అందించాలనే లక్ష్యంతో త్రిపురనేని రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.నరేష్ పాత్రకు సంబంధించిన మేకప్ కోసమే ఆయన భారీగా ఖర్చు పెట్టారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా రాజేంద్ర ఈ చిత్రం నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
నరేష్ బొద్త్దెన అవతారంలో కనిపించబోతున్నారు. ఈ రూపం కోసం హాలీవుడ్‌కి చెందిన మేకప్ నిపుణులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నరేష్ సరసన భూమిక నటిస్తోంది. త్రిపురనేని రాజేంద్రప్రసాద్ నిర్మాత. నరేష్ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.
ఈ చిత్రానికి చక్రి స్వరాలు అందిస్తున్నారు. రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. నరేష్ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.
భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే: సత్యానంద్, మాటలు: నివాస్, పాటలు: భాస్కరభట్ల, ఆర్ట్: నారాయణరెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, రచన-దర్శకత్వం: రవిబాబు, నిర్మాత: త్రిపురనేని రాజేంద్ర.


Click it and Unblock the Notifications











