అల్లరి నరేష్ 'లడ్డుబాబు' విడుదల తేదీ ఖరారు

By Srikanya

LadduBabu
హైదరాబాద్: అల్లరి నరేష్‌ హీరోగా నటించిన చిత్రం 'లడ్డుబాబు'. పూర్ణ, భూమిక హీరోయిన్స్. రవిబాబు దర్శకత్వం వహించారు. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత. ఏప్రియల్ 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.... బాబు లడ్డులా ఉంటాడు. అందుకే లడ్డుబాబు అని పేరు పెట్టారు. అతని వయసు 28 ఏళ్లు. బరువు 268 కిలోలు. చెప్పుకోవడానికి చరిత్ర ఇంతేనా? అని మాత్రం అనొద్దు. అతనికి గొప్ప ప్రేమకథ కూడా ఉంది. అదేమిటో తెలియాలంటే మాత్రం మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లరి నరేష్‌.

దర్శకుడు మాట్లాడుతూ ''భారీకాయం కలిగిన ఓ యువకుడి కథ ఇది. అతని బరువు ఎన్ని సమస్యల్ని తెచ్చిపెట్టింది? వాటి నుంచి ఎలా బయటపడ్డాడన్న అంశాల్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. నరేష్‌ వేషం, నటన చిత్రానికి ప్రధాన బలం'' అన్నారు. ''ఇంటిల్లిపాదినీ అలరించే వినోదాత్మక చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. చక్రి సంగీతం, భాస్కరభట్ల పాటలు బాగా కుదిరాయి'' అన్నారు నిర్మాత.

తొలిసారి లడ్డుబాబు ఫస్ట్ లుక్ లో అల్లరి నరేష్ గెటప్ చూసి... ఆశ్చర్యపోనివారు ఎవరూ ఉండరు. స్లిమ్ బోయ్‌గా ఉండే నరేశ్... ఫ్యాటీ బోయ్‌గా కనపడటం కోసం చాలా కష్టాలే పడ్డారు. ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో లడ్డుబాబుగా కనిపించడం కోసం అల్లరి నరేశ్ నాలుగున్నర గంటల ముందే స్పాట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆడియో ఫంక్షన్ కోసమే ఇంత కష్టపడితే, ఈ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లూ అల్లరి నరేశ్ ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఊహించుకోవచ్చు.

ఆహార్యం, అభినయం పరంగా నరేష్ కిది సవాల్ లాంటి పాత్ర. ఈ పాత్రను అద్భుతంగా చేశారు. లడ్డూబాబుగా నరేష్ ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత రవిబాబు, నరేష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడం, నరేష్ లుక్ వినూత్నంగా ఉండటం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే మంచి చిత్రం అందించాలనే లక్ష్యంతో త్రిపురనేని రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.నరేష్ పాత్రకు సంబంధించిన మేకప్ కోసమే ఆయన భారీగా ఖర్చు పెట్టారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా రాజేంద్ర ఈ చిత్రం నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే: సత్యానంద్, మాటలు: నివాస్, పాటలు: భాస్కరభట్ల, ఆర్ట్: నారాయణరెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, రచన-దర్శకత్వం: రవిబాబు, నిర్మాత: త్రిపురనేని రాజేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X