twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడవాళ్ళ బట్టల పనిలో రవితేజ

    By Staff
    |

    రవితేజ త్వరలో ఆడవాళ్ళకు మాత్రమే బట్టలు డిజైన్ చేసే పనిలో బిజీ కానున్నాడు. ఎనభైల్లో వంశి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. అలాగే ఈ సారి లేడీస్ టైలర్ కాస్తా సిటీల్లో ఉండే ఫ్యాషన్ డిజైనర్ గా మారనున్నాడు. ఈ ఫ్యాషన్ డిజైనర్..లేడీస్ కి బట్టలు డిజైన్ చేయటంలో నైపుణ్యం కలిగి ఉంటాడని సమాచారం. అలాగే టైటిల్ కూడా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అని పెడుతున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ స్క్రిప్టు తయారు చేస్తున్నారు. ఇక ఈ కథతో అల్లరి నరేష్ హీరోగా సినిమా చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే అవును..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాంబినేషన్ రిపీట్ అయితే క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమలో టాక్. ప్రస్తుతం వంశి గోపి..గోపిక..గోదావరి టైటిల్ తో కమిలిని ముఖర్జీ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X