హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళపై అటాక్..ఇన్నర్స్ పట్టుకొని లాగుతూ
హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న దిశా ఘటన, నిన్న పబ్‌లో సినీ తారపై అసభ్య ప్రవర్తన, నేడు సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళతో కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన తీరు చూసి ఖంగు తింటున్నారు హైదరాబాద్ జనం. కొద్దిసేపటి క్రితం మహిళా సినీ ఆర్ట్ డైరెక్టర్‌పై ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి పోతే..

రెచ్చిపోయిన మైనర్లు.. మహిళపై దాడి
దిశా ఘటన పూర్తిగా మరచిపోకముందే మరో మహిళపై దాడి జరగడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ముగ్గురు మైనర్లు రెచ్చిపోయారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళా ఆర్ట్ డైరెక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెపై దాడికి పాల్పడ్డారు.

మీదపడి దాడి చేశారంటూ ఫిర్యాదు
సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళా ఆర్ట్ డైరెక్టర్ కారును ఢీ కొట్టిన ముగ్గురు మైనర్లు ఆమెపై దాడి చేశారు. తన మీదపడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ మేరకు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఆమె.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కారును ఫాలో అయి, వెనుక నుంచి ఢీ కొట్టి మరీ
TS09FD5959 అనే కారులో ఆ మహిళా సినీ ఆర్ట్ డైరెక్టర్ ప్రయాణించింది. అది గమనించిన కొందరు ఆకతాయిలు ఆమె ప్రయాణిస్తున్న కారును ఫాలో అయి, వెనుక నుంచి ఢీ కొట్టి ఆమెపై దాడికి పాల్పడ్డారని తెలిసింది. ఈ సందర్భంలో ఆమెను అసభ్యకరంగా తాకుతూ రెచ్చిపోయారని ఆ బాధితురాలు పేర్కొంది.
Recommended Video

ఇన్నర్స్ పట్టుకొని లాగారు..
తనపై దాడి చేసిన ఆ మైనర్లు మరో 20 మందిని తీసుకొచ్చి తనను కొట్టారని, అసభ్యకరంగా దూషించారాని బాధితురాలు పేర్కొంది. తన ఇన్నర్స్ పట్టుకొని లాగారని, బట్టలు, ప్యాంట్ లాగారని చెప్పింది. వాళ్లలో మైనర్ ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారని చెప్పింది. వాళ్ళ భాష ఉర్దూలో ఉండటంతో వాళ్ళు ఏమంటున్నారో తనకు సరిగా అర్థం కాలేదని ఆమె మీడియాతో తెలిపింది.


Click it and Unblock the Notifications











